ఒంగోలు సిటీ: అప్రెంటీస్ మేళాలో సుమారు 72 మంది విద్యార్థులు హాజరుకాగా, 43 మంది అప్రెంటీస్ శిక్షణకు తాత్కాలికంగా ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఎం.వి.నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ప్రభుత్వ బాలుర ఐటీఐలో నిర్వహించిన ప్రధానమంత్రి జాతీయ అప్రంటీస్ షిప్ మేళా డిసెంబరు–2024 కార్యక్రమంలో సహాయ అప్రెంటీస్ సలహాదారు, ప్రధానాచార్యులు ఎం.వి.నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు.
Apprenticeship Apprenticeship Mela for iti students
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐటీఐ పాసైన విద్యార్థులు పూర్తి స్థాయి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలంటే అప్రంటీస్‌షిప్ ట్రైనింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ అప్రంటీస్ మేళాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ టి.భరద్వాజ్, డీఎస్‌డీఓ రవి తేజ యాదవ్ పాల్గొని అప్రంటీస్ విలువల గురించి మాట్లాడారు.