Skip to main content

HCL jobs: HCL Technology లో భారీగా ఉద్యోగాలు జీతం 20 లక్షలు

HCL Technology jobs
HCL Technology jobs

ఇటీవలి కాలంలో వరుసగా దేశంలోని ఐటీ సేవల కంపెనీలు కొత్తగా రిక్రూట్మెంట్లను చేపడుతున్నాయి. ఈ క్రమంలో టాప్ టెక్ కంపెనీలు వరుసగా నియామకాలను చేపట్టడంపై హైదరాబాద్ టెక్కీలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే అధిక వేతనం కోసం ఎదురుచూస్తున్న టెక్కీలకు హెచ్‌సిఎల్ శుభవార్త చెప్పింది.

10వ తరగతి అర్హతతో ఇండియన్‌ పోస్టల్‌ శాఖలో స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ ఉద్యోగాలు జీతం నెలకు 30000: Click Here

ప్రస్తుతం టెక్ దిగ్గజం హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ హైదరాబాద్, పూణే, బెంగళూరుకు, కోయంబత్తూర్ SAP TM టెక్నికల్ కన్సల్టెంట్(SAP TM+ ABAP) పాత్ర కోసం ఉద్యోగుల నియమాకాలు చేపడుతున్నట్లు పోస్ట్ విడుదల చేసింది. 

ఇది పూర్తిగా హైబ్రిడ్ వర్క్ విధానంలో కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. దీని ప్రకారం అభ్యర్థులు ఎంపికైన తర్వాత వారానికి కేవలం 3 రోజులు ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి ప్రస్తుతం మూడు ఖాళీలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ రోల్ కింద ఈ నియామకం ఉంది.

17 నుంచి 20 లక్షలు వార్షిక వేతనాన్ని ఆఫర్:

ఇక్కడ కంపెనీ విద్యార్హతల విషయంలో ఏదైనా గ్రాడ్యుయేటన్ పూర్తి చేసి ఉండాలని పేర్కొంది. అలాగే 30 రోజులు నోటీసు పరియడ్ ఉన్న వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు పేర్కొంది. పైన పేర్కొన్న పాత్రకు కంపెనీ 3 పోస్టులు ఉన్నట్లు కంపెనీ నోటిపై చేసింది. అనుభవజ్ఞులైన టెక్కీలకు రోల్ కోసం రూ.17 నుంచి 20 లక్షలు వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. వాస్తవానికి కంపెనీ నిన్న దీనికి సంబంధిని ఓపెనింగ్ విడుదల చేయగా టెక్కీల నుంచి భారీగా స్పందనతో పాటు దరఖాస్తులు వస్తున్నాయి. ఇది పూర్తిగా ఫుల్ టైం వర్క్ అని కంపెనీ పేర్కొంది. అలాగే 3-6 ఏళ్ల అనుభవం ఉన్న టెక్కీలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

టెక్ కంపెనీకి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే 59 దేశాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న కంపెనీ ప్రస్తుతం 2.18 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ ప్రధానంగా డిజిటల్, ఇంజనీరింగ్, క్లౌడ్ అండ్ ఏఐ వంటి టెక్నాలజీలపై పనిచేస్తోంది. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, టెక్నాలజీ అండ్ సర్వీసెస్, టెలికాం అండ్ మీడియా, రిటైల్ అండ్ CPG, పబ్లిక్ సర్వీసెస్ వంటి రంగాల్లోని కంపెనీలకు సేవలను అందిస్తోంది.

ప్రధానంగా హైదరాబాద్ టెక్ కంపెనీలకు కొత్త గమ్యస్థానంగా మారిన వేళ అనేక కంపెనీలు ఈ నగరంలోని టెక్కీలను రిక్రూట్ చేసుకునేందుకు ప్రాధాన్యం అందిస్తున్నాయి. ప్రధానంగా SAPపై ఇటీవలి కాలంలో అనేక ఓపెనింగ్స్ పడుతున్నాయి. ఎక్కువ అనుభవం కలిగిన టెక్కీలకు కంపెనీలు ఈ క్రమంలో అవకాశం కల్పిస్తున్నాయి. హైదరాబాద్ ఫైనాన్స్ రంగంలోని కంపెనీలకు డెస్టినేషన్ గా మారిన వేళ ప్రస్తుత రిక్రూట్మెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 

Published date : 10 Jan 2025 07:46PM

Photo Stories