Skip to main content

Job Mela: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 15వేల వేతనం

అరకులోయ టౌన్‌: స్థానిక ఆర్‌ఐటీఐలో ఈనెల 12న మినీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ జిల్లా అధికారి డాక్టర్‌ పి. రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో రుద్ర కోఆపరేటివ్‌ సర్వీసెస్‌, మెహాన్‌ స్వీఇంటెక్‌, పేటీఎం, నవత రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలు పాల్గొంటున్నట్టు ఆమె పేర్కొన్నారు.
Job Mela  Arakuloya Town Mini Job Fair Announcement  Dr. P. Rohini Announces Job Fair at RITI on 12th December
Job Mela Job Mela for freshers candidates

జిల్లాకు చెందిన 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండి, టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఆపై చదువులు చదివిన యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొనేందుకు అర్హులన్నారు.

Job Mela: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. ఎప్పుడు? ఎక్కడంటే..

పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాల జెరాక్స్‌ కాపీలతో హాజరుకావాలని ఆమె కోరారు. ఇంటర్వ్యూలో ఎంపికై న వారికి నెలకు రూ. 10వేల నుంచి రూ. 15 వేల వరకు జీతం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

జాబ్‌మేళా ముఖ్యసమాచారం

వయస్సు: 18-30 ఏళ్లకు మించకూడదు
విద్యార్హత: టెన్త్‌ ఇంటర్‌ డిగ్రీ

వేతనం: నెలకు రూ.10,000- రూ. 12,000
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్‌ 12న
ఇంటర్వ్యూ లొకేషన్‌: అరకు ఆర్‌ఐటీఐలో 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 10 Dec 2024 10:15AM

Photo Stories