Skip to main content

Students Education : విద్యార్థుల బోధ‌న‌పై విద్యాశాఖ ఆదేశాలు..

ఇంటర్‌ విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలంటూ ప్రిన్సిపాళ్లకు ఇంటర్‌ బోర్డు జిల్లా విద్యాశాఖాధికారి (డీఐఈఓ) ఎ.రఘునాథరెడ్డి ఆదేశించారు.
Students education in junior college

తాడిమర్రి: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం నిర్వ‌హించిన ప్రిన్సిపాళ్ల‌ స‌మావేశంలో డీఈఓ ర‌ఘునాథ‌రెడ్డి మాట్లాడారు. తాడిమర్రి, ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొత్తం 428 మంది విద్యార్థులు ఉండగా 202 మంది విద్యార్థులకు అపార్‌ చేసి 47 శాతం ప్రక్రియ పూర్తి చేశారన్నారు. మిగిలిన 53 శాతం అపార్‌ త్వరతగతిన పూర్తి చేయాలని సూచించారు.

Bharat Electronics Limited jobs: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..నెలకు రూ.50వేలకు పైనే జీతం

ఈ నెల 17 నుంచి 23 తేదీ వరకూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహించాలన్నారు. అధ్యాపకులు స్వయంగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి వేసిన మార్కులను 27న ఆల్‌లైన్‌ చేయాలన్నారు. అలాగే తొలి విడత ఫ్రీ ఫైనల్‌ పరీక్షలను జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు, రెండవ ఫ్రీ ఫైనల్‌ పరీక్షలను ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు నిర్వహించాలన్నారు.

Holidays List 2025 : ఉద్యోగుల‌కు 2025లో మొత్తం సెల‌వులు ఎన్ని ఉంటాయంటే..!

ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణ పరీక్ష రాసి, తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలన్నారు. ఈ పరీక్షకు గైర్హాజరైనా పరీక్ష ఫెయిల్‌ అయినా వార్షిక పరీక్షలో ఉత్తీర్ణులుగా పరిగణించబరని పేర్కొన్నారు. అనంతరం ఇంటర్‌ బోర్డు అందించిన సంకల్ప్‌–2025 మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సురేష్‌బాబు, అధ్యాపకులు భాస్కర్‌రెడ్డి, పోతలయ్య పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 14 Dec 2024 01:36PM

Photo Stories