Skip to main content

TGPSC Chairman : గ్రూప్స్ పరీక్ష‌ల ఫ‌లితాలపై టీజీపీఎస్సీ చైర్మ‌న్ ప్ర‌క‌ట‌న‌.. ఎప్పుడంటే!

టీజీపీఎస్సీ నిర్వ‌హించే గ్రూప్స్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌కు సంబంధించి సంస్థ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం ఒక కీల‌క ప్ర‌క‌టన చేశారు.
TGPSC groups exams results on march 2025  TGPSC Group Exam Results Announcement  Government Job Exams Group-1, Group-2, Group-3  Group Exam Results March 2025  TGPSC Results Key Announcement

సాక్షి ఎడ్యుకేష‌న్: టీజీపీఎస్సీ నిర్వ‌హించే గ్రూప్స్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌కు సంబంధించి సంస్థ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం ఒక కీల‌క ప్ర‌క‌టన చేశారు. వివిధ ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నిర్వ‌హించే గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 వంటి ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను వ‌చ్చే ఏడాది మార్చిలో అంటే, మార్చి 2025 చివరిలో ఫ‌లితాల విడుద‌ల ఉంటుందని తెలిపారు.

Climate Change: 13,000 కి.మీ.లు వలస వెళ్లిన భారీ జలచరం.. కారణం ఇదే..

ఈ నేప‌థ్యంలో 18, 19వ తేదీల్లో స‌ర్వీస్ క‌మిష‌న్ ఢిల్లీకి ప‌ర్య‌ట‌న చేస్తామ‌ని, మొద‌ట 18వ తేదీన యూపీఎస్సీకి వెళ్లి, చాఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న‌ర్‌ను క‌లుస్తామ‌ని వివ‌రించారు. అంతేకాకుండా, జాతీయ స్థాయి రిక్రూట్మెంట్ ఏజెన్సీల‌ను క‌లుస్తామిని కూడా తెలిపారు. 19న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఛైర్మన్ ను, ఆ రోజు సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ను కలుస్తామని, అలాగే, జనవరి చివరి నాటికి ప్రభుత్వానికి మా యాక్షన్ ప్లాన్ ఇస్తామని వెల్లడించారు.

TSPSC Group 2 Question Paper with Key 2024 : గ్రూప్‌–2 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు...

వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ లు తెలంగాణ సర్వీస్ కమిషన్ ను సందర్శించాలని అనుకుంటున్నాయి… నియామక ప్రక్రియ ఏదైనా గరిష్టంగా ఒక సంవత్సరం లోపే పూర్తి చేయాలని ప్లాన్ అన్నారు. మార్చి చివరి వరకు గ్రూప్ వన్, గ్రూప్ 3, గ్రూప్ 2 పలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 14 Dec 2024 02:55PM

Photo Stories