Skip to main content

Top Jobs in Future : భ‌విష్య‌త్తులో ఎక్కువ డిమాండ్ ఉన్న జాబ్స్ ఇవే.. వేత‌నం ఎంతో తెలుసా..!

వ‌చ్చే 20 ఏళ్ల‌లో భారీ డిమండ్ ఉండే ఉద్యోగాలు వాటికి వ‌చ్చే వేత‌నాల‌పై నిపుణులు ఇలా భావిస్తున్నారు..
Top jobs in future with full demand and huge salaries

సాక్షి ఎడ్యుకేష‌న్: ఉద్యోగాల విష‌యంలో ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. అంతా కూడా కొత్త టెక్నాల‌జీ కార‌ణంగా, ఏఐతో నడుస్తోంది. వీటివల్ల ఇప్పటికే కొన్ని ఉద్యోగాలకు కొరత ఏర్పడింది. ఇక భ‌విష్య‌త్తులో అంటే.. మ‌న‌మే అర్థం చేసుకోవ‌చ్చు.. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ఉద్యోగాల ప‌రిస్థితి ఇలా ఉంటే మ‌రి 20 ఏళ్ల త‌రువాత మ‌రో జ‌న‌రేష‌న్ ప‌రిస్థితి ఏంటి..?

భవిష్య‌త్తులో అధిక వేత‌నం!

ఏఐ భ‌విష్య‌త్తులో ఎంతో అభివృద్ధి చెందుతుంద‌ని అంటున్నారు నిపుణులు. అయితే, ఈ రంగంలో ఉద్యోగాల‌కు మంచి డిమాండ్ ఉంటుంద‌ట‌. ఇప్ప‌టి కంటే ఎంతో ఎక్కువ వేత‌నం అప్పుడే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సుమారు 50 ల‌క్ష‌ల నుంచి కోటి వ‌ర‌కు వేత‌నం ఉంటుంద‌ని నిపుణ‌లు అంటున్నారు.

Government Job Notification: 52,453 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. టెన్త్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం

ఏఐ నిపుణుడు మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, రోబోటిక్స్ లేదా డీప్ లెర్నింగ్‌తో వంటి రంగాల వారికి అధిక వేతనం లభిస్తుంది.

రోబోటిక్ ఇంజనీర్ల

రోబోటిక్ ఇంజనీర్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంద‌ని అంచ‌నా. మెకానికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సాంకేతికతలను ఉపయోగించి రోబోట్‌లు వాటి సిస్టమ్‌లను అభివృద్ధి చెంద‌గా.. వీరికి ఏడాదికి రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు జీతం ఉంటుంది. వచ్చే 20 ఏళ్లలో వీరికి భారీ డిమాండ్ ఉంటుందట.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

మెషిన్ లెర్నింగ్

ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌లో ఉద్యోగం సాధిస్తే 45 నుంచి 90 లక్షల వరకు జీతం ఉంటుంద‌ట‌. టెక్నాలజీ మారుతుండటంతో వచ్చే ఏళ్లలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌కి అవకాశాలు పెరుగుతాయని నిపుణుల అంచ‌నా.

బయోటెక్నాలజీ

బయోటెక్నాలజీ పరిశోధకుడుకు భవిష్యత్తులో మ‌రింత‌ డిమాండ్ ఉంటుది. ఏడాదికి రూ.40 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు వేతనం లభిస్తుంది. బయో టెక్నాలజీ, జీవశాస్త్రం, బయో కెమిస్ట్రీ లేదా బయో మెడికల్ ఇంజనీరింగ్‌ను అధ్యయనం చేసే వారికి మంచి డిమాండ్ ఉంటుంది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

డేటా సైంటిస్ట్‌

డేటాను విశ్లేషించడానికి, గణాంకాలు, కంప్యూటర్ సైన్స్ వంటి వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ డేటా సైంటిస్ట్‌లకు ఏడాదికి రూ. 35 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు జీతం వస్తుంది.

క్వాంటం కంప్యూటర్‌

క్వాంటం కంప్యూటర్‌లకు భ‌విష్య‌త్తులో భారీ డిమాండ్ ఉంటుంది. క్వాంటం అల్గారిథమ్‌లను మూల్యాంకనం చేయడం, క్వాంటం నిర్వచనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం కోసం వీరిని సెలక్ట్ చేసుకుంటారు. ఈ క్వాంటం కంప్యూటింగ్ పరిశోధకుడుకు ఏడాదికి రూ.40 లక్షల నుంచి రూ.85 లక్షల వేతనం లభిస్తుందట.

Civil Services : ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ ఖాళీల వెల్ల‌డించిన కేంద్రం..

Published date : 14 Dec 2024 09:53AM

Photo Stories