Skip to main content

Anganwadi Workers : అంగ‌న్వాడీ ఉద్యోగుల ధ‌ర్నాకు..

అంగ‌న్వాడీల్లోని ఉద్యోగులకు స‌రైనా జీతాలు, స‌దుపాయాలు లేక అధికారుల‌ను ఆశ్ర‌యించ‌గా ఎవ్వ‌రూ స్పందించ‌లేదు.
Protest for anganwadi workers demands

సాక్షి ఎడ్యుకేష‌న్: అంగ‌న్వాడీల్లోని ఉద్యోగులకు స‌రైనా జీతాలు, స‌దుపాయాలు లేక అధికారుల‌ను ఆశ్ర‌యించ‌గా ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు కొన్ని రోజులుగా ధర్నా చౌక్‌లో ఆందోళన చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గురువారం సెక్రటేరియట్‌కు వారంతా వచ్చి మంత్రి సీతక్కను కలిశారు.

Semester Exams Postponed 2024: పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా.. కారణమిదే!

వారికి నెల జీతంగా రూ.18 వేలకు పెంచాలని, అంతేకాకుండా.. అంగన్‌వాడీలు, మినీ అంగన్‌వాడీలకు పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల వేతన బకాయిలు చెల్లించాలని, గత ప్రభుత్వంలో చేసిన సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని మంత్రి సీతక్క‌కు విజ్ఞప్తి చేశారు.

Jobs In Health Department: వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

అంగన్వాడీ మ‌హిళా ఉద్యోగినుల‌కు చీర‌లు..

మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాంలుగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది స్వశక్తి సంఘాల మహిళలకు ప్రత్యేక డిజైన్లలో చీరలు తయారు చేయించింది. అలాగే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చే చీరలను గురువారం మంత్రి సీతక్క చీరల డిజైన్లు పరిశీలించారు. కార్యక్రమంలో సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, డైరెక్టర్‌ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Dec 2024 04:15PM

Photo Stories