CM Revanth Reddy : ప్రతిష్ఠాత్మక పదవుల్లో నాటి గురుకుల విద్యార్థులు.. త్వరలోనే..
సాక్షి ఎడ్యుకేషన్: గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్‌ను ప్రారంభించారు. గురుకులాలు అంటే, బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో ఉన్న గురుకుల పాఠశాలకు ఆయన సందర్శించారు. గురుకుల పాఠశాలలో చేసిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ మాట్లాడారు ఆయన.. గురుకులాలకి గొప్ప గుర్తింపు తీస్కురావాలని కోరారు.
TGPSC Chairman : గ్రూప్స్ పరీక్షల ఫలితాలపై టీజీపీఎస్సీ చైర్మన్ ప్రకటన.. ఎప్పుడంటే!
పెంచిన డైట్ చార్జీలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెనూ రూపోందించింది. గురుకులాల వ్యవస్థను పీవీ నరసింహారావు హయాంలో తీసుకోవచ్చారని గుర్తు చేశారు రేవంత్. ఇటీవలె, డైట్ ఛార్జీలు పెంచారన్నారు. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రితిభను వెలికితీసే కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు.
మాజీ విద్యార్థులు వీరే..
టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంటకేశం, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఒకప్పుడు ఈ గురుకులాల్లో చదివిన విద్యార్థులే. ఇక్కడ చదివిన వారెందరో నేడు ఉన్నత స్థాయిలో నిలిచారు. ప్రస్తుతం, చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నతంగా చదివి గొప్ప స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని అన్నారు సీఎం రేవంత్. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కంటే గురుకుల విద్యార్థులు తక్కువ అనే అపోహ ఉంది. కనుక, దీనిని త్వరలోనే తొలగించేలా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- telangana cm revanth reddy
- Gurukul schools
- development
- food and facilities in gurukuls
- telangana gurukuls
- old students
- higher education
- best position
- tgpsc chairman and ias officer burra venkatesham
- ex dgp mahender reddy
- tg gurukul schools
- gurukulam development
- food and education quality
- best education
- students growth in gurukuls
- gurukul school students
- talent encouragement
- diet charges in gurukul schools
- Telangana Government
- Government school students
- high schools and gurukul schools
- high school students
- students talents
- Chilkur Gurukul School
- TG CM Revanth Reddy
- revanth reddy speech
- gurukul students encouragement
- cm revanth reddy speech to gurukul students
- basic facilities in gurukul schools
- students health and education
- Education News
- Sakshi Education News