Skip to main content

IIT Student Bumper Offer Story : జాక్‌పాట్ కొట్టారిలా.. ఏడాది రూ.4.3 కోట్ల జీతంతో.. ఇంకా చాలా మంది...

నెమ్మ‌దిగా కొన‌సాగుతున్న‌.. క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్ ఒక్క‌సారిగా ఊపు అందుకుంది. ఇప్పుడు ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు టాప్ ఐఐటీ కాలేజీల వైపు చూస్తున్నాయి.
iit student bumper offer 4.3 core banged in campus placements

ఈ కాలేజీల్లో మంచి టాలెంట్ ఉన్న విద్యార్థుల‌ను ఎక్కువ‌ శాలరీ ఫ్యాకేజీ ఇచ్చి ఎంపిక చేసుకుంటాయి. తాజాగా గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలలోని(IITs) 2025 బ్యాచ్ విద్యార్థుల కోసం బేస్, ఫిక్స్‌డ్ బోనస్ & రీలొకేషన్‌ వంటి వాటితో సహా మొత్తం రూ. 4.3 కోట్లకు పైగా అత్యధిక వేతన ఆఫర్‌ను అందించింది. ఈ ఆఫర్ ఐఐటీ మద్రాస్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి సొంతం చేసుకున్నారు.

➤☛ Junior Civil Judge Topper Success Story : ఇక్కడ మిస్సయినా.. అక్క‌డ‌ టాపర్‌గా నిలిచానిలా... కానీ..

మొదటి రోజు వచ్చిన రిక్రూటర్లలో క్వాల్కమ్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మన్ సాక్స్, బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్, అల్ఫోన్సో, న్యూటానిక్స్ కంపెనీలు ఉన్నాయి. గత సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్‌లో భారీ ప్యాకేజీలను ప్రకటించారు. 

తుది నియామకాలు ప్రారంభమైన..
ఐఐటీ ఢిల్లీ, బాంబే, మద్రాస్, కాన్పూర్, రూర్కీ, ఖరగ్‌పూర్, గౌహతి, బీహెచ్‌యూలలో ఇటీవ‌ల‌ తుది నియామకాలు ప్రారంభమైన సమయంలో ఈ ఆఫర్ వెలువడింది.

ఎక్కువ శాలరీ ఫ్యాకేజీ ఆఫర్ చేసిన కంపెనీల జాబితా ఇలా..

iit student story in telugu

➤☛ బ్లాక్‌రాక్, గ్లీన్ & డావిన్సీ : రూ. 2 కోట్ల కంటే ఎక్కువ.
➤☛ ఏపీటీ పోర్ట్‌ఫోలియో అండ్ రూబ్రిక్ : రూ. 1.4 కోట్ల కంటే ఎక్కువ
➤☛ డేటాబ్రిక్స్, ఎబుల్లియెంట్ సెక్యూరిటీస్, ఐఎంసీ ట్రేడింగ్: రూ. 1.3 కోట్ల కంటే ఎక్కువ
➤☛ క్వాడే : సుమారు రూ.1 కోటి
➤☛ క్వాంట్‌బాక్స్ అండ్ గ్రావిటన్ : రూ. 90 లక్షలు.
➤☛ డీఈ షా : రూ. 66 లక్షల నుంచి రూ. 70 లక్షల మధ్య
➤☛పేస్ స్టాక్ బ్రోకింగ్ : రూ. 75 లక్షలు
➤☛ స్క్వేర్‌పాయింట్ క్యాపిటల్ : రూ. 66 లక్షల కంటే ఎక్కువ
➤☛ మైక్రోసాఫ్ట్ : రూ. 50 లక్షల కంటే ఎక్కువ
➤☛ కోహెసిటీ : రూ. 40 లక్షలు

Published date : 03 Dec 2024 03:09PM

Photo Stories