Skip to main content

Samhita Microsoft Job Rs.52 lakh Salary :లక్కీ ఛాన్స్ అంటే ఈమెదే.. ప్ర‌ముఖ కంపెనీలో జాబ్.. రూ. 52 లక్షల జీతం.. ఎలా అంటే..?

ప్ర‌స్తుతం ప్ర‌ముఖ కంపెనీలు అన్నీ.. విద్యార్థుల్లో మంచి నైపుణ్యాలుంటే ఎంత జీతం అయినా ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్నాయి. ఇటీవల కొంతమంది లక్షల నుంచి కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికైన సంఘటనలు చాలానే చూశాం.
Dream Job, Financial Success, Job Offer with High Salary, Samhita Microsoft Job Rs 52 lakh Salary success story Telugu, successful career,
Samhita

ఈ క్రమంలోనే తెలంగాణ‌ సంగారెడ్డికి చెందిన ఓ విద్యార్థిని మంచి ఛాన్స్ కొట్టేసింది. కాలేజీలో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ ఇంటర్య్వూలో ఏకంగా రూ. 52లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికై అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆమె మరెవరో కాదు సంగారెడ్డికి జిల్లా ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పుష్పలత, విష్ణువర్ధన్‌రెడ్డి దంపతుల కుమార్తె సంహిత. ఈమె మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియాలోని బీవీఐఆర్టీ ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఈమె ఇంజనీరింగ్ విద్య కొనసాగుతుండగానే ఉద్యోగం సాధించింది.

కుంటి సాకులు చెప్పేవారికి.. స‌రైన స‌మాధానం ఈమె..

52 lak salary samhitha story in telugu

ఎంత చదివినా ఉద్యోగాలు రావడం లేదు.. ఉద్యోగాలు లేవు అని కుంటి సాకులు చెప్పేవారికి ఈ అమ్మాయి సాధించిన విజయం వారి కళ్లు తెరిపిస్తుందని చెప్పవచ్చు. ప్రతిభ ఉంటే ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించి.. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. 

UPSC Civils Ranker Tharun Patnaik Story : ఎలాంటి కోచింగ్ లేకుండానే.. వ‌రుస‌గా రెండు సార్లు సివిల్స్ కొట్టానిలా..

విద్యార్థిని తల్లిదండ్రులు..
మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియాలోని బీవీఐఆర్టీ ఇంజనీరింగ్ కాలేజీలో.. ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ ఇంటర్య్వూలు చేపట్టింది. ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ ఇంటర్య్వూలో ఈమె మంచి ప్రతిభ కనబర్చి ఏడాదికి రూ.52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఈ ప్లేస్‌మెంట్‌ రావడానికి కారణం కళాశాలలో అందించిన శిక్షణతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని సంహిత అన్నారు.

☛ ఇలాంటి మ‌రిన్ని స‌క్సెస్ స్టోరీల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 26 Sep 2023 08:21AM

Photo Stories