Skip to main content

Job Opportunities In 2025 Report: ఐటీ జాబ్‌ కోసం చూస్తున్నారా? 2025లో భారీగా నియామకాలు

ఐటీ రంగంలో 2025లో 15–20 శాతం మేర అధిక నియామకాలు నమోదవుతాయని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ అంచనా వేసింది. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయ ఆరు నెల్లలో ఈ రంగంలో కదలిక వచ్చిందని, దీంతో 2025లో ఈ పరిశ్రమలోని పలు విభాగాల్లో నియామకాలు ఆశావహంగా ఉంటాయని తెలిపింది.
Job Opportunities In 2025 Report  NLB Services forecast for IT sector hiring growth Growth in IT sector recruitment expected in 2025
Job Opportunities In 2025 Report IT Hiring Growth

కీలక నైపుణ్యాలు కలిగిన.. కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), డేటా అనలైటిక్స్, క్లౌడ్‌ టెక్నాలజీలకి డిమాండ్‌ 30–35 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. డిమాండ్‌లో పెరుగుదల కేవలం ఈ నైపుణ్యాలకు మాత్రమే పరిమితం కాదని, టెక్నాలజీ నైపుణ్యాలను పెంచుకోవడంపైనా దృష్టి సారించాలని పేర్కొంది.

One Nation, One Subscription(ONOS): జవవరి 1 నుంచి 'వన్‌ నేషన్‌ -వన్‌ సబ్‌స్క్రిప్షన్‌' పథకం అమలు.. ఈ విషయాలు తెలుసా?

మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తమ మానవవనరులను అవసరమైన నైపుణ్యాలపై తర్ఫీదు ఇవ్వడంపై కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు వివరించింది. పెద్ద కంపెనీలకు ఇప్పటికీ క్యాంపస్‌ నియామకాలు ప్రాధాన్యంగా కొనసాగుతాయని, 2024–25 ద్వీతీయ ఆరు నెలల్లో ఇవి చురుగ్గా నియామకాలు చేపట్టొచ్చని పేర్కొంది.

IT Hiring Growth

MIT Suspends Indian Origin Student: అమెరికాలో భారత విద్యార్థి కెరియర్‌ నాశనం.. ఆ ఫొటో కారణమా?

ఏఐ, ఎంఎల్, డేటా అనలైటిక్స్, పైథాన్, క్లౌడ్‌ టెక్నాలజీలకు నెలకొన్న అధిక డిమాండ్‌ 2025లో ఐటీలో ఫ్రెషర్ల నియామకాలు పెరిగేందుకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. గ్లోబల్‌ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు), తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్‌ కంపెనీలు సైతం 30–35 శాతం అధికంగా ఐటీ నిపుణులను తీసుకోవచ్చని అంచనా వేసింది.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 11 Dec 2024 03:55PM

Photo Stories