Skip to main content

Merit Scholarships: ఏయూ విద్యార్థులకు ‘కాగ్నిజెంట్‌’ మెరిట్‌ స్కాలర్‌షిప్‌

Merit Scholarship   Cognizant Foundation merit scholarships for B.Ed Special Education students at Andhra University  Andhra University B.Ed Special Education students awarded merit scholarships
Merit Scholarship

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చదువుతున్న విద్యార్థులకు కాగ్నిజెంట్‌ ఫౌండేషన్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అందజేసింది. మొత్తం పదిమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.70 వేలు చొప్పున మొత్తం రూ.7లక్షల సహాయం చేసింది.

Inter అర్హతతో కొత్తగా 8వేల VRO ఉద్యోగాలు: Click Here

ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమచేసింది. ఈ సందర్భంగా స్కాలర్‌ షిప్‌ సాధించిన విద్యార్థులను వీసీ ఆచార్య జి.శశిభూషణరావు మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి స్కాలర్‌షిప్‌ అందించిన కాగ్నిజెంట్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విభాగాధిపతి ఆచార్య టి.షారోన్‌రాజు మాట్లాడుతూ ఏటా తమ విభాగంలోని విద్యార్థులకు కాగ్నిజెంట్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. ఏయూ అలుమ్ని అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కుమార్‌ రాజా, విద్యా విభాగం అధ్యాపకులు డాక్టర్‌ ప్రకాష్‌, డాక్టర్‌ ఆలీ, డాక్టర్‌ మూర్తి, డాక్టర్‌ రాము తదితరులు పాల్గొన్నారు.

Published date : 05 Dec 2024 09:33AM

Photo Stories