Govt Scholarships: ఈ పథకానికి ఎంపికైతే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 50వేలు..
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ).. 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి మహిళలను టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో ప్రోత్సహించేందుకు ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్‌ను విడుదల చేసింది. ప్రగతి స్కాలర్‌షిస్ స్కీమ్ పేరిట ఏటా అర్హులైన విద్యార్థినులకు రూ.50వేల ఉపకార వేతనాన్ని అందిస్తోంది. డిప్లొమా, ఇంజనీరింగ్ చదువుతున్న వారు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 10,000. డిప్లొమా స్థాయిలో 5000 మందికి, ఇంజనీరింగ్ స్థాయిలో 5000 మందికి చొప్పున వీటిని అందిస్తారు.
అర్హతలు
- ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో డిప్లొమా లేదా బీటెక్ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి.
- ఆయా కోర్సులో ఫస్ట్ ఇయర్ లేదా లేటరల్ ఎంట్రీలో సెకండ్ ఇయర్‌లో చేరినవాళ్లే ఈ స్కాలర్‌షిప్ దరఖాస్తుకు అర్హులు.
- ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలకు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.
- తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షలకు మించి ఉండరాదు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాల్సి ఉంటుంది.
CUET Exam Changes In 2025: యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)లో మార్పులు
ఏటా రూ.50వేలు
- ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన విద్యార్థినులకు ఏటా రూ.50 వేలను అందిస్తారు. డిప్లొమా వారికి మూడేళ్ల పాటు, ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్నవారికి నాలుగేళ్ల పాటు ఉపకార వేతనం చెల్లిస్తారు.
- లేటరల్ ఎంట్రీలో చేరిన డిప్లొమా కోర్సుల విద్యార్థినులకు రెండేళ్లు, లేటర్ ఎంట్రీ ఇంజనీరింగ్‌లో చేరితే మూడేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందుతుంది. ఈ మొత్తం నేరుగా విద్యార్థిని బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు. దీన్ని ఫీజు, వసతి, పుస్తకాలు, కంప్యూటర్ తదితర ఖర్చుల కోసం వెచ్చించుకోవచ్చు. అకడెమిక్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా తర్వాతి ఏడాది వీటిని కొనసాగిస్తారు.
Jobs In Paytm: పదో తరగతి అర్హతతో పేటీఎంలో ఉద్యోగాలు..
ఎంపిక ఇలా
డిప్లొమా అభ్యర్థులైతే పదోతరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజనీరింగ్‌లో చేరినవారైతే ఇంటర్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుని ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.12.2024
- వెబ్‌సైట్: https://scholarships.gov.in/
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- Govt scholarships
- Scholarships
- AICTE Pragati Scholarship Scheme
- AICTE Pragati Scholarship
- aicte pragati scholarship for girls
- All India Council of Technical Education
- Diploma
- Engineering
- Latest scholarships
- Rs50000Scholarship
- AnnualScholarshipProgram
- DiplomaStudents
- sakshi education scholarships
- PragatiScholarship2024
- FinancialAidForWomen
- DiplomaScholarships
- EducationFunding