Skip to main content

Tomorrow All Colleges Holiday Due Bandh 2024 : రేప‌టి నుంచి కాలేజీలు బంద్.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌స్ : అన్ని కాలేజీల యాజమాన్యాలు నిరవధికంగా బంద్ ప్ర‌క‌టించారు. నేటి నుంచి అన్ని డిగ్రీ, పీజీ కాలేజీల‌కు ఈ సెల‌వులు వ‌ర్తించ‌నున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసే వ‌ర‌కు కాలేజీలను ఓపెన్ చేయ‌మ‌ని తెలిపారు.
holidayannouncementforcolleges  Tomorrow All Colleges Holiday Due Bandh 2024  collegestrikenotification

రూ.2 వేలకోట్ల బకాయిలు విడుదల చేసే వరకూ కాలేజీల బంద్‌ను కొనసాగిస్తామని, సెమిస్టర్ పరీక్షలనూ బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. నిధులు విడుదల కాకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురవుతోందని వారు వాపోయారు.

ప‌రీక్ష‌లు కూడా వాయిదా..?
కాలేజీల బంద్‌ ప్రభావం డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలపై పడనుంది. డిగ్రీ 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు ఈ వారంలో జరగాల్సి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు నేటి నుంచి జరగాల్సి ఉంది. న‌వంబ‌ర్ 21వ తేదీ నుంచి మహత్మాగాంధీ యూనివర్సిటీ, ఈనెల 26 నుంచి కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు వర్సిటీల పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ న‌వంబ‌ర్‌ నెలలోనే శాతవాహన, తెలంగాణ వర్సిటీల సెమిస్టర్‌ పరీక్షలు సైతం జరగనున్నాయి. నెలాఖరు నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కాలేజీ యాజమాన్యాలు బంద్‌కు పిలుపునివ్వటంతో వాటి ప్రభావం పరీక్షలపై పడనుంది.
 
విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం..
ఈ ఏడాది దసరా సెలవుల తర్వాత అక్టోబర్ చివరికల్లా డబ్బులు అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. అయినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోవడంతో కాలేజీలను బంద్ చేస్తున్నామని వెల్లడించారు. గతంలో అక్టోబర్ 14 నుంచి 17 వరకు కాలేజీలు మూసివేసినప్పుడు విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 

దాంతో తరగతులు నిర్వహించామని, ఈసారి డబ్బులు విడుదల చేసేంత వరకు కాలేజీలు తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఇక మాటలు వినే పరిస్థితుల్లో లేమని పెండింగ్ బకాయిలు విడుదల చేసే వరకు బంద్‌ కొనసాగుతుందన్నారు. ఈ మేరకు యాజమాన్య సంఘాలు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తమకు కనీసం..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తమకు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదని వాపోయారు. 90 శాతం కాలేజీల యాజమాన్యాలు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయన్నారు.

2025 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

2025 జనవరి  :
☛➤ నూతన సంవత్సరం : 01
☛➤ భోగి : 13
☛➤ సంక్రాంతి : 14
☛➤ క‌నుమ : 15
☛➤ రిపబ్లిక్ డే : 26

ఫిబ్రవరి 2025 : 

☛➤ మహ శివరాత్రి : 26

మార్చి 2025 :
☛➤ హోలీ : 14
☛➤ ఉగాది : 30
☛➤ రంజాన్ : 31

ఏప్రిల్ 2025 :
☛➤ రంజాన్ తర్వాత రోజు : 01
☛➤ బాబు జగజ్జీవనరావు జయంతి :  05
☛➤ శ్రీరామ నవమి :  06
☛➤ అంబేడ్కర్ జయంతి :  14
☛➤ గుడ్ ఫ్రైడే :  18

మే 2025 :
మేడే : 1

జూన్ 2025 :
☛➤ బక్రీద్ :  07

జూలై :  2025
☛➤ మొహర్రం : 06
☛➤ బోనాలు : 21

ఆగస్టు 2025 :
☛➤ స్వతంత్ర దినోత్సవం : 15
☛➤ కృష్ణాష్టమి : 16
☛➤ వినాయక చవితి : 27

సెప్టెంబర్ 2025 :
☛➤ మిలాద్ నబీ : 05
☛➤ బతుకమ్మ మొదటి రోజు : 21

అక్టోబర్ 2025 :
☛➤ గాంధీ జయంతి : 02
☛➤ దసరా తర్వాత రోజు : 03
☛➤ దీపావళి : 20

నవంబర్  2025 :
☛➤ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి : 05

డిసెంబర్ 2025 :
☛➤ క్రిస్మస్ : 25
☛➤ క్రిస్మస్ తర్వాత రోజు : 26

2025 జ‌న‌వ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు పూర్తి సెల‌వుల వివ‌రాలు ఇవే...

Published date : 20 Nov 2024 09:44AM

Photo Stories