Skip to main content

Private Colleges: ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్‌ ప్రారంభం.. దీంతో ఈ ప్రవేశాలు నిలిచిపోయాయి..

ఉస్మానియా యూని వర్సిటీ /ఖమ్మం సహకార నగర్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్ 14న రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజ మాన్యాలు నిరవధిక బంద్‌ ప్రారంభించాయి.
bandh of private colleges begins

దీంతో పీజీ రెండో విడత ప్రవేశాలు నిలిచిపోయాయి. అయితే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఓయూ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ రాములు తెలిపారు. కాగా, ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్‌కు తెలంగాణ రిపబ్లికన్‌ స్టూడెంట్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బోయ రమేశ్‌ మద్దతు ప్రకటించారు. కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

చదవండి: Medical Colleges: వైద్య విద్య సీట్లపై ‘ప్రైవేటు’ కన్ను!.. ఇందుకోసం డీమ్డ్‌ యూనివర్సిటీలుగా మారేందుకు యత్నాలు

ఖమ్మం జిల్లాలో విద్యాసంస్థల బంద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవ డంతో తెలంగాణ ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ పిలుపుమేరకు ఖమ్మం జిల్లాలో విద్యాసంస్థలను బంద్‌ చేసినట్టు అసోసియేషన్‌ ఖమ్మం జిల్లా బాధ్యులు పి.ఉపేందర్‌రెడ్డి, ఎం.ప్రభాకర్‌రెడ్డి, వేణుమాధవ్‌ తెలి పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో కళాశాలలు మూతపడ్డాయని చెప్పారు. బకాయిలు విడుదల చేసే వరకు బంద్‌ పాటిస్తామని వారు వెల్లడించారు.

Published date : 15 Oct 2024 03:54PM

Photo Stories