PhD Exam Table: ప్రీ పీహెచ్‌డీ పరీక్షల టైంటేబుల్ విడుదల
Sakshi Education
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు నవంబర్ 4, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి అక్టోబర్ 4న ఒక ప్రకటనలో తెలిపారు.
4న పేపర్–1 రీసెర్చ్ మెథడాలజీ, పేపర్ 2 8న ఎలక్టివ్ పేపర్ల (స్పెషలైజేషన్) పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు.
చదవండి: PhD Entrance Exam Results: పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆల్‌ఇండియా ఫస్ట్‌ర్యాంక్..
పరీక్షలు కాకతీయ యూనివర్సిటీలోని కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలకేంద్రంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగుతాయని నర్సింహాచారి తెలిపారు.
Published date : 05 Oct 2024 03:12PM