NAS Survey: డిసెంబర్ 4న ‘న్యాస్’ సర్వే
Sakshi Education
కాళోజీ సెంటర్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించడానికి డిసెంబర్ 4న నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్) నిర్వహిస్తున్నట్లు వరంగల్ డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు.
వరంగల్‌లోని తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల హెచ్‌ఎంలకు నవంబర్ 21న ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడారు.
చదవండి: Faizan Ahmed IAS: వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
3, 6, 9 తరగతుల విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల వారీగా మాదిరి ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రతి పాఠశాలలో ప్రత్యేక బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుజన్ తేజ, డీసీఈబీ సెక్రటరీ గారె కృష్ణమూర్తి, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, ఏసీజీ అరుణ పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 23 Nov 2024 09:37AM