Travel Insurance: విదేశీ విద్యకు ప్రయాణ బీమా దన్ను.. బీమా ప్రయోజనాలు ఇవే..
అయితే, ఈ ఉత్కంఠభరితమైన సాహసయాత్రలో రిస్కులు, అనిశ్చితులూ ఉంటాయి. హెల్త్ ఎమర్జెన్సీల నుంచి.. ట్రిప్‌లు రద్దవడం వరకు పలు రకాల సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే విదేశాల్లో విద్యాభ్యాసాన్ని ఎంచుకున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఒక ఆప్షన్ కాదు.. తప్పనిసరిగా తీసుకోతగిన రక్షణ కవచంలాంటిది. ఇందుకు గల అనేక కారణాల్లో కొన్ని...
ఆరోగ్య సంరక్షణకు..
విదేశాల్లో హెల్త్‌కేర్ వ్యవస్థలు, వ్యయాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పలు దేశాల్లో వైద్య వ్యయాలు భారీగానే ఉంటాయి. దీన్ని అధిగమించడం శక్తికి మించిన భారంగా అనిపించవచ్చు. ఉదాహరణకు అమెరికాలో మామూలుగా ఆసుపత్రికి వెళ్లినా వందల కొద్దీ డాలర్ల వ్యయంతో కూడుకున్న వ్యవహారంగా ఉంటుంది. ఇక మిగతా దేశాల్లో ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ అనేది వేల కొద్దీ డాలర్లతో ముడిపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఊహించని వ్యయాల భారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది ప్రయాణ బీమా. డాక్టర్ విజిట్స్, ఆసుపత్రిలో చేరడం, ఎమర్జెన్సీ మెడికల్ ఎవాక్యుయేషన్లు మొదలైన వాటన్నింటికీ కవరేజీని ఇస్తుంది. ఈ విషయంలో భరోసా లభించడం వల్ల విద్యార్థులు తమ చదువుపై నిశ్చింతగా ఫోకస్ చేసేందుకు వీలుంటుంది.
ప్రయాణాలకు ఆటంకాలెదురైనా..
రాజకీయ అనిశ్చితి, ప్రకృతి వైపరీత్యాలు లేదా వ్యక్తిగతంగా అత్యవసర పరిస్థితులు తలెత్తడం మొదలైన ఊహించని అంశాల వల్ల ప్రయాణ ప్రణాళికలపై ప్రభావం పడొచ్చు. ఒకవేళ మీరు వెళ్లే దేశంలో ప్రకృతి వైపరీత్యం తలెత్తి, ట్రిప్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి, మళ్లీ కొత్తగా బుక్ చేసుకోవాల్సి వస్తే.. ఆయా వ్యయాలన్నింటికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా కవరేజీని పొందే అవకాశం ఉంటుంది. అదనంగా ఆర్థిక భారం పడకుండా మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే మీ ట్రిప్‌ను కుదించుకున్నా లేక అది రద్దయినా.. ప్రయాణ ఏర్పాట్ల కోసం మీరు వెచ్చించిన మొత్తం డబ్బు వృధా కాకుండా చూసుకోవడానికి వీలవుతుంది.
విలువైన వస్తువులకు భద్రత..
విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్తున్నప్పుడు విలువైన ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, ఇతరత్రా అవసరమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులను వెంట తీసుకెళ్లే అవకాశం ఉండొచ్చు. సరిగ్గా పాఠాలు ప్రారంభమయ్యే సమయానికి మీ ల్యాప్‌టాప్ పోయిందంటే ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే ప్రయాణ బీమా ఉంటే ఈ గందరగోళం నుంచి బైటపడేందుకు ఆస్కారం ఉంటుంది. దీనితో ఆయా ఉత్పత్తుల రీప్లేస్‌మెంట్ ఖర్చులతో పాటు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సామాన్లకు కూడా కవరేజీని పొందవచ్చు.
విదేశాల్లో 24 గంటల ఎమర్జెన్సీ సహాయం..
24/7 ఎమర్జెన్సీ అసిస్టెన్స్ సర్వీస్ అనేది ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో అత్యంత కీలకమైన ఫీచర్లలో ఒకటి. లోకల్ డాక్టరును సంప్రదించడం మొదలుకుని అత్యవసరంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం వరకు వివిధ ఎమర్జెన్సీ సందర్భాల్లో తక్షణ సహాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటికి దూరంగా ఉండే సమయంలో విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు సహాయం అందుబాటులో ఉంటుందనే ఆలోచన ఎంతో నిశ్చింతనిస్తుంది.
థర్డ్ పార్టీ లయబిలిటీ
ప్రమాదాలనేవిఅనుకోకుండానే జరిగిపోతాయి. మనం ఎంత పరిశోధన చేసి, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా.. సరిగ్గా సమయం వచ్చేసరికి అన్నీ పక్కకు వెళ్లిపోవచ్చు. విదేశాల్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ప్రమాదవశాత్తూ థర్డ్ పార్టీలకు ఏదైనా నష్టం కలిగించడం వల్ల పరిహారాన్ని చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. అద్దెకు తీసుకున్న ఇల్లు ప్రమాదవశాత్తూ దెబ్బతిన్నా, ఏదైనా ప్రమాదంలో ఎవరైనా గాయపడినా .. మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది లీగల్, ఆర్థిక వ్యయాలను కవర్ చేస్తుంది.
దూరదృష్టి ముఖ్యం..
ప్రయాణ బీమా అనవసర ఖర్చు అనే ఉద్దేశంతో పక్కన పెట్టేసేద్దామని అనిపించినా.. విదేశాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు ఎదురయ్యే రిస్కుల గురించి ఒకసారి ఆలోచిస్తే.. ఇది ఎంతో వివేకవంతమైన పెట్టుబడి కాగలదు. హెల్త్ ఎమర్జెన్సీలు, ప్రయాణాలు రద్దు కావడం, వస్తువులు పోవడం, లీగల్ ఖర్చులు, కాలేజీ ఫీజులపరమైన నష్టాలు మొదలైన వాటన్నింటికీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ ఉంటుందనే ఆలోచన కొండంత భరోసానిస్తుంది. మిగతా వాటి గురించి ఆందోళన చెందకుండా నిశ్చింతగా చదువుపై దృష్టి పెట్టేందుకు ఉపయోగపడుతుంది.
Tags
- Overseas Education
- Travel Insurance
- Study Abroad
- International Travel Insurance
- Student Travel Insurance
- Buy Travel Insurance for Students Online
- Student Travel Insurance Policy
- Buy Travel Insurance Plans for Students
- Going Abroad for Higher Studies
- Travel insurance for overseas education from india
- Best health insurance for students studying abroad
- Best travel insurance for overseas education
- Medical insurance for Indian students studying abroad
- Cheapest health insurance for international students
- insurance