Skip to main content

ఈ పరీక్షకు ఒకటే ఆన్సర్‌ షీటు.. భవితపై వేటు!

సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన బ్రిడ్జి కోర్సు పరీక్షలో రెండు సమాధాన పత్రాలు ఇవ్వాల్సిన విద్యార్థులకు ఒకే ఆన్సర్‌ షీట్‌ ఇవ్వడంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఎదురైంది.
bridge course answer sheet issue kgbv students telangana

పరీక్ష వివరాలు:

బెజ్జూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, స్థానిక కేజీబీవీలో ఒకేషనల్‌ ఇంటర్‌ (మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌) చదువుతున్న విద్యార్థినులు వార్షిక పరీక్షలు రాశారు. బ్రిడ్జి కోర్సులో బయాలజీ (బాటనీ, జువాలజీ),   ఫిజికల్‌ సైన్స్‌ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) పరీక్షలు వేర్వేరు పత్రాలలో రాయాల్సి ఉండగా, ఒకే ఆన్సర్‌ షీట్‌ ఇవ్వడంతో సమస్య ఏర్పడింది.

చదవండి: పదోతరగతి అర్హతతో ఎస్‌ఈసీఆర్‌లో 835 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా!

విద్యార్థుల సంఖ్య:

  • బుధవారం ప్రథమ సంవత్సరానికి 22 మంది విద్యార్థులు హాజరు.
  • గురువారం ద్వితీయ సంవత్సరానికి 33 మంది విద్యార్థులు హాజరు.

ఫిర్యాదు & చర్యలు:

ఈ అంశంపై కేజీబీవీ ప్రత్యేకాధికారి అరుణ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీఐఈవో కల్యాణి సమస్య పరిష్కారంపై హామీ ఇచ్చారు. బెజ్జూర్‌ కళాశాల చీఫ్‌ సూపరింటెండెంట్‌ సపన్‌ మండల్‌ స్పందిస్తూ, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని వెల్లడించారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 21 Mar 2025 05:16PM

Photo Stories