విద్య, వికాసానికి కేరాఫ్.. ఈ విద్యాలయాలు!.. త్వరగా దరఖాస్తు చేసుకోండి..

కేంద్రీయ విద్యాలయాలను తొలుత దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశ భద్రత (రక్షణ శాఖ) విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పిల్లల చదువుల కోసం ఏర్పాటు చేశారు. మొదట వీటిని సెంట్రల్ çస్కూల్స్ గా పిలిచేవారు. ఆ తర్వాత కేంద్రీయ విద్యాల యాలు(కేవీ)గా పేరు మార్చారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటైన కేవీలను పర్యవేక్షించేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అనే పేరుతో ప్రత్యేక పర్యవేక్షణ సంస్థను సైతం నెలకొల్పారు.
ఒకటి నుంచి పదో తరగతి వరకు..
ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశారు. ఒకటో తరగతిలో ప్రవేశించాలంటే.. మార్చి 31, 2025 నాటికి కనిష్టంగా ఆరేళ్లు, గరిష్టంగా ఎనిమిదేళ్ల మధ్యలో వయసు ఉండాలి. తొలుత దేశ రక్షణ, భద్రత దళాల ఉద్యోగుల పిల్లల చదువుల కోసం ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాల యాల్లో.. ఇప్పుడు అన్ని వర్గాల వారు ప్రవేశం పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పలు ప్రాథమ్యతల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు.
అయిదు కేటగిరీలుగా..
కేంద్రీయ విద్యాలయాల్లోకి విద్యార్థులను ఎంపిక చేసే క్రమంలో అయిదు కేటగిరీలుగా ప్రాధాన్య తలను పేర్కొని ప్రవేశాలు కల్పిస్తున్నారు. బదిలీౖయె న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఆఫ్ ది ఇండియన్ గవర్న్‌మెంట్‌కు సంబంధించి బదిలీ ౖయెన, సాధారణ ఉద్యోగుల పిల్లలు. అదేవిధంగా బదిలీౖయెన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ ఉద్యోగుల పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌కు సంబంధించి బదిలీౖయెన, సాధారణ ఉద్యోగుల పిల్లలు, పై కేటగిరీలకు చెందని ఇతర వర్గాల పిల్లలు. ఇలా వివిధ కేటగిరీలుగా పేర్కొని అడ్మిషన్స్ కల్పిస్తున్నారు.
చదవండి: KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక ప్రవేశాలు.. పరీక్ష లేకుండా ప్రవేశాలు!
ఎంపికలోనూ ప్రాధాన్యత
ప్రవేశాల ఖరారు, ఎంపిక విషయంలోనూ ప్రాధా న్యత విధానాన్ని అమలు చేస్తున్నారు. తల్లిదండ్రు లకు ఒకే ఆడపిల్లగా ఉన్న విద్యార్థినికి, రాష్ట్ర ప్రభు త్వ ఇన్‌స్టిట్యూట్‌లు/సీబీఎస్‌ఈతోపాటు జాతీయ/ రాష్ట్ర స్థాయి క్రీడల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. స్పెషల్ ఆర్ట్స్ లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది.
ఒకటో తరగతికి ఆన్‌లైన్ దరఖాస్తు
ఒకటో తరగతిలో ప్రవేశాలకు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబా టులోకి తెచ్చారు. ఈ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా గరి ష్టంగా మూడు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పూర్తిగా లాటరీ విధానంలో సంబంధిత కేంద్రీయ విద్యాలయ అధికారులు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ లాటరీ విధానంలో సైతం ప్రాధాన్యతల వారీ విధానాలను అనుసరిస్తున్నారు. ఇది కూడా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది.
![]() ![]() |
![]() ![]() |
వయో పరిమితి నిబంధనలు
- ఒకటో తరగతి: 6–8 ఏళ్లు, రెండో తరగతి: 7–9 ఏళ్లు, మూడో తరగతి: 8–10 ఏళ్లు, నాలుగో తరగతి: 9–11 ఏళ్లు, ఐదో తరగతి: 9–11 ఏళ్లు, ఆరో తరగతి: 10–12 ఏళ్లు, ఏడో తరగతి: 11–13 ఏళ్లు, ఎనిమిదో తరగతి: 12–14 ఏళ్లు, తొమ్మిదో తరగతి: 13–15 ఏళ్లు, పదో తరగతి: 14–16 ఏళ్లు. –పీడబ్లూడీ విద్యార్థులకు రెండేళ్ల వయో సడలింపు ఉంటుంది.
- రిజర్వేషన్: తాజా ప్రవేశాలకు సంబంధించి ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 7.5 శాతం సీట్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.
ఇంటర్ వయోపరిమితి లేకుండానే
ఇంటర్మీడియెట్‌లో మాత్రం ఎలాంటి వయో పరి మితి నిబంధనలు లేకుండానే ప్రవేశాలు కల్పి స్తున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరా లకు సంబంధించి ఎలాంటి వయో పరిమితి లేదు. అయితే ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులైన సంవత్సరంలోనే ఇంటర్ ప్రథమ సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ ప్రథమ సంవత్సరం తర్వాత బ్రేక్ లేని వారికే ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తా రు. అందుబాటులో ఉన్న సీట్లు, నిబంధనల ఆధా రంగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
తొమ్మిదో తరగతికి.. ప్రవేశ పరీక్ష
తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు జరిగే ఈ అడ్మిషన్ టెస్ట్‌లో హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్‌సైన్స్, సైన్స్ సబ్జెక్ట్‌ల లో ఒక్కో సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 33 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత సంబంధిత కేంద్రీయ విద్యాలయ అధికారులు మెరిట్ జాబితా రూపొందించి పైన పేర్కొన్న కేటగిరీల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రవేశాలు కల్పిస్తారు.
స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్
కేంద్రీయ విద్యాలయాల్లో కొత్తగా చేరే పిల్లలు స్కూల్ వాతావరణానికి అలవాటుపడేలా చేసేందుకు ఆరు వారాల వ్యవధితో ‘స్కూల్ రెడీనెస్ ప్రో గ్రామ్’ను రూపొందించాయి. ఈ ప్రోగ్రామ్ పూర్తయిన అనంతరం టీచర్లు విద్యార్థుల్లో పలు దృక్పథా ల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయా లేదా అనే విషయాలను పరీక్షి స్తారు. ముఖ్యంగా పరిసరాలను అర్థం చేసుకోవడం, ఆత్మవిశ్వాసం, పరిశీలన, పరస్పర సంబంధాలు, వర్గీ కరణ , ప్యాట్రన్‌లను అర్థం చేసుకొని అనుకరించగల గడం, భావ వ్యక్తీకరణ, అవగాహన, క్రియేటివ్ స్కి ల్స్. దీంతోపాటు ఒకటి నుంచి అయిదో తరగతి వి ద్యార్థులకు ఐదు పాయింట్ల çసూచీని పాటిస్తున్నారు.
నామ మాత్రపు ఫీజులు
కేంద్రీయ విద్యాలయాలు నామ మాత్రపు ఫీజులను వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ ఫీజు రూ.25. విద్యాలయ వికాస నిధి(రూ. 500), ట్యూషన్ ఫీజు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ తదితర ఫీజులు ఉంటాయి. ఒకటి నుంచి అయిదో తరగతి విద్యా ర్థులకు అన్ని ఫీజులు కలిపి నెలకు రూ.500–600, ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1000 లోపు అవుతుంది. బాలికలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య సమాచారం
- ఒకటో తరగతికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 2025, మార్చి 21
- ఎంపికైన విద్యార్థుల మొదటి జాబితా: మార్చి 26, రెండో జాబితా: ఏప్రిల్ 2, మూడో జాబితా: ఏప్రిల్ 7.
- 2వ తరగతి నుంచి(ఇంటర్ ఫస్టియర్ మినహా) ఆఫ్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 2 –11, జాబితా వెల్లడి: ఏప్రిల్ 17.
- పదకొండో తరగతి మినహా అన్ని తరగతులకు ప్రవేశాలకు చివరి తేదీ: జూన్ 30.
- ఇంటర్ ప్రథమ సంవత్సరం రిజిస్ట్రేషన్: ఇప్పటికే కేవీల్లో చదువుతున్న విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ ఫలితాలు వచ్చిన పది రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. వీరికి పదో తరగతి ఫలితాలు వచ్చిన ఇరవై రోజుల్లోగా ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
- కేవీ విద్యార్థులు కాని వారు సీబీఎస్‌ఈ ఫలితాలు వచ్చిన 30 రోజుల్లోగా ఆన్‌లైన్ అడ్మిషన్‌ను ఖరారు చేసుకోవాలి.
- వెబ్‌సైట్: https://kvsangathan.nic.in/ en/ admission
Tags
- Kendriya Vidyalaya admissions 2025
- KV school admission process
- Kendriya Vidyalaya online application
- KV admission eligibility criteria
- KV admission age limit
- Kendriya Vidyalaya fee structure
- KV admission notification 2025
- Central government school admissions
- KV school selection process
- Kendriya Vidyalaya class 1 admission
- KV admission without entrance test
- Kendriya Vidyalaya online registration
- KV admission for defense personnel children
- Kendriya Vidyalaya admission dates 2025
- KV school facilities and curriculum