Skip to main content

నైపుణ్యాల పెంపులో విద్యాసంస్థల కీలక పాత్ర: ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, సాక్షి: మారుతున్న ప్రపంచీకరణ విధానాలతో భారత విద్యాసంస్థలు అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్య అవకాశాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో నైపుణ్యాల పెంపుకు విద్యాసంస్థల పాత్ర కీలకమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు.
telangana education skill development uk partnership

బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషన్‌ మరియు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యూకే-తెలంగాణ విశ్వవిద్యాలయాల మధ్య ఉన్న అత్యుత్తమ విద్యా విధానాలను అన్వేషించి పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని సూచించారు.

చదవండి: Change in Admission Rules: రాష్ట్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఎవరెవరు అర్హులు?.. ప్రవేశాల నిబంధనలకు సర్కారు సవరణ!

తెలంగాణ భారత ఆర్థిక అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తోందని, ఈ నేపథ్యంలో నైపుణ్యాల పెంపుదల కోసం విద్యాసంస్థలు మరింత దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (తెలంగాణ, ఏపీ) గారెత్‌ విన్‌ ఓవెన్‌ మాట్లాడుతూ, తెలంగాణ-యూకే విద్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు బ్రిటన్‌ విశ్వవిద్యాలయాలతో కలిసి విద్యా పురోభివృద్ధికి పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 14 Mar 2025 06:05PM

Photo Stories