Skip to main content

కౌన్సెలింగ్.. గైడెన్సే కీలకం.. ఈ స్థాయిలోనే కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాలి !

 Ganesh Kohli giving a talk on career counseling   counseling career guidance for students mental health stress relief   Career guidance for students

విద్యార్థుల మానసిక ఒత్తిడికి పరిష్కారం

ప్రస్తుత విద్యా విధానం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించాలంటే, పాఠశాల స్థాయిలోనే కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్‌ అందించాల్సిన అవసరం ఉంది. IC3 (International College & Career Counseling) మూమెంట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ కెరీర్ కౌన్సిలర్ గణేశ్ కోహ్లి విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నివారణపై కీలక సూచనలు చేశారు.

మానసిక ఒత్తిడికి కారణాలు

  • పరీక్షల్లో మార్కుల ఒత్తిడి
  • ఇతరులతో పోల్చే తత్వం
  • ఆర్థిక, కుటుంబ సమస్యలు
  • వైఫల్యం అంటే భయపడే మనస్తత్వం
  • పాఠశాల స్థాయిలో కెరీర్ గైడెన్స్ లేకపోవడం

సంఖ్యలు భయపడేలా చేస్తున్నాయి!

  • 2012లో 6,654 మంది విద్యార్థుల ఆత్మహత్యలు
  • 2022 నాటికి 13,044 కు పెరిగిన గణాంకాలు

చదవండి: పదోతరగతి అర్హతతో మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌లో 75 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

పాఠశాలల్లోనే కౌన్సెలింగ్‌ అవసరం

  • విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా మానసిక ఆరోగ్య శిక్షణ అందించాలి.
  • కెరీర్‌ గైడెన్స్‌ ద్వారా భవిష్యత్తుపై స్పష్టత రావాలి.
  • విద్యార్థుల సహజ నైపుణ్యాలను గుర్తించేలా ప్రోత్సహించాలి.
  • ఫిన్లాండ్, కెనడా, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లోనూ కౌన్సెలింగ్‌ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి.

తల్లిదండ్రుల భాద్యత ఏమిటి?

  • పిల్లల ఆలోచనలను అర్థం చేసుకోవాలి
  • వారి సమస్యలను పట్టించుకోవాలి
  • కేవలం మార్కులపై కాకుండా నైపుణ్యాలపై దృష్టిపెట్టాలి

చదవండి: 10th Class అర్హతతో 133 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.69,100 జీతం!

పరీక్ష విధానంపై మార్పు అవసరం

  • కేవలం మార్కుల ఆధారిత పరీక్షలు కాకుండా సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి.
  • జాతీయ విద్యా విధానం కూడా సామర్థ్య ఆధారిత మూల్యాంకనం పట్ల దృష్టి సారిస్తోంది.

విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు..

  • టీచర్లకు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై శిక్షణ
  • తరగతి గదుల్లో ఎమోషనల్ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌
  • కెరీర్‌ కౌన్సెలింగ్‌ను మాధ్యమిక స్థాయి నుంచే ప్రారంభించాలి
  • విద్యార్థులను ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో ప్రోత్సహించాలి

విద్యార్థుల భవిష్యత్తు కోసం మార్పు అనివార్యం! కౌన్సెలింగ్, కెరీర్‌ గైడెన్స్‌తో మంచి సమాజాన్ని నిర్మిద్దాం.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 14 Mar 2025 01:37PM

Photo Stories