TG EAPCET 2025 Notification: టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే!

ఫిబ్రవరి 25 నుంచి ఈఏపీసెట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. సెట్‌కు సంబంధించి సమగ్ర వివరాలను నోటిఫికేషన్‌లో అధికారికంగా విడుదల చేసారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు అమలులో ఉన్న స్థానికేతర కోటాను ఈసారి ఎత్తివేయాలని నిర్ణయించారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ కూడా వచ్చింది. వీటన్నింటినీ నోటిఫికేషన్‌లో పొందుపరుస్తారు. ఫిబ్రవరి 20న మధ్యాహ్నం 2.30 గంటలకు వెబ్‌సైట్‌లో ఈఏపీసెట్ నోటిఫికేషన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొంది.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | టిఎస్-ప్రివియస్ పేపర్స్ | గెస్ట్ కాలమ్
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఈ సారి కూడా ఈఏపీసెట్ 2025 నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకే అప్పగించారు. ఈ మేరకు జేఎన్టీయూ ప్రొఫెసర్ డీన్ కుమార్‌ను ఈఏపీసెట్ 2025 పరీక్ష కన్వీనర్‌గా ఉన్నత విద్యామండలి నియమించింది.
ఇప్పటికే ఈఏపీసెట్‌కు సంబంధించిన మొత్తం కసరత్తు పూర్తైంది. ఈ ఏడాది పరీక్షలకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి తన ప్రటకనలో పేర్కొంది.
టీజీ ఈఏపీసెట్ షెడ్యూల్ ఇదే..
విషయం | ముఖ్యమైన తేదీలు |
నోటిఫికేషన్ | ఫిబ్రవరి 20, 2025 |
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం | ఫిబ్రవరి 25, 2025 |
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ | ఏప్రిల్ 4, 2025 |
పరీక్ష తేదీ (అగ్రికల్చర్, ఫార్మసీ) | ఏప్రిల్ 29, 30, 2025 |
పరీక్ష తేదీ (ఇంజినీరింగ్) | మే 2,3,4,5 2025 |
![]() ![]() |
![]() ![]() |

Tags
- Telangana EAPCET detailed Notification released
- EAPCET-2025
- TG EAPCET 2025
- Telangana Engineering Agriculture and Pharmacy Entrance Test
- TGCHE
- tg eapcet 2025 entrance exam dates
- TG EAPCET 2025 Schedule
- TG EAPCET 2025 Important Dates
- TG EAPCET 2025 Syllabus
- TG EAPCET 2025 Agriculture Exam Dates
- TG EAPCET 2025 Engineering Exam Dates
- Telangana Council for Higher Education
- TS EAMCET 2025
- TS EAMCET 2025 Notification Today
- Jawaharlal Nehru Technological University Hyderabad
- JNTUH
- Telangana News
- TelanganaEAPCET
- TGEAPCET examdates