Skip to main content

TG EAPCET 2025 Notification: పూర్తి సమాచారం మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ వివరాలు

TG EAPCET 2025 Notification   TG EAPCET 2025 notification released  TG EAPCET 2025 important dates and schedule How to apply for TG EAPCET 2025 online  Exam syllabus and pattern for TG EAPCET 2025
TG EAPCET 2025 Notification

తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET 2025) కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (JNTUH) ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ మరియు హెల్త్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. అర్హతా ప్రమాణాలు, పరీక్షా తేదీలు, రిజిస్ట్రేషన్ ఫీజు మరియు అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

8వ తరగతి అర్హతతో హైకోర్టులో మజ్దూర్ ఉద్యోగాలు జీతం నెలకు 40,300: Click Here

తెలంగాణ EAPCET 2025 పరీక్ష జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTUH) ఆధ్వర్యంలో నిర్వహించనుంది. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ అనుబంధ కళాశాలల్లో ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది.

కోర్సులు
ఇంజినీరింగ్: B.E., B.Tech., B.Tech (బయోటెక్నాలజీ), B.Tech (డైరీ టెక్నాలజీ)
ఎగ్రికల్చర్ & ఫార్మసీ: B.Sc. (Hons.) Agriculture, B.Pharmacy, Pharm-D
హెల్త్ సైన్సెస్: B.Sc. (నర్సింగ్), B.V.Sc. & A.H., B.F.Sc.

అర్హతలు
భారతీయ పౌరసత్వం కలిగిన విద్యార్థులు మాత్రమే అర్హులు
కనీసం 45% (SC/ST కి 40%) మార్కులతో ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణత
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు కనీస వయస్సు 16 సంవత్సరాలు

పరీక్ష తేదీలు & రిజిస్ట్రేషన్ ఫీజు
ఎగ్రికల్చర్ & ఫార్మసీ: ఏప్రిల్ 29-30, 2025
ఇంజినీరింగ్: మే 2-5, 2025
ఫీజు: ₹500 (SC/ST/PH), ₹900 (ఇతరులు)

ఆన్‌లైన్ అప్లికేషన్ వివరాలు
ప్రారంభం: ఫిబ్రవరి 25, 2025
చివరి తేదీ (లేట్ ఫీజు లేకుండా): ఏప్రిల్ 4, 2025
లేట్ ఫీజుతో అప్లికేషన్: ఏప్రిల్ 24, 2025 వరకు

తెలంగాణ EAPCET 2025  Exam Format
పరీక్షా విధానం: ఆన్‌లైన్‌ (CBT – Computer-Based Test)
ప్రశ్నల రకం: ఆబ్జెక్టివ్ టైప్ (Objective Type) – బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQs)
మొత్తం మార్కులు: 160

📐 Mathematics / Biology: 80 ప్రశ్నలు
🔬 Physics: 40 ప్రశ్నలు
🧪 Chemistry: 40 ప్రశ్నలు
మొత్తం సమయం: 3 గంటలు

మాధ్యమం: తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ (Application Process)
ఆఫిషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళండి: eapcet.tgche.ac.in
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి:
ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.

అప్లికేషన్ ఫారం పూరించండి:
వ్యక్తిగత వివరాలు
విద్యా అర్హత వివరాలు
ఫోటో మరియు సైన్ అప్‌లోడ్ చేయండి
దాఖలు చేయడం: సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్‌ తీసుకోవడం తప్పనిసరి

వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి: eapcet.tgche.ac.in

Published date : 22 Feb 2025 09:08AM

Photo Stories