Skip to main content

TG EAPCET 2025: ఇలా దరఖాస్తు చేసుకుంటేనే కోరుకున్న పరీక్ష కేంద్రం.. దరఖాస్తు చేసేటప్పుడు ముఖ్యమైన సూచనలు ఇవే!

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TGEAPCET 2025)కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది! ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీలలో ప్రవేశం పొందాలని కలలుకంటున్న అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Engineering, Agriculture, Pharmacy entrance exam registration   Exam center selection for TG EAPCET is a first come first served choice   TGEAPCET 2025 online application form submission

విద్యార్థులు ఏప్రిల్ 4, 2025 వరకు అప్లై చేయవచ్చు. అగ్రికల్చర్ & ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29 & 30న, ఇంజినీరింగ్ పరీక్షలు మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది టీజీఈఏపీసెట్‌ను హైదరాబాద్ జేఎన్‌టీయూహెచ్ (JNTUH) నిర్వహిస్తోంది.

దరఖాస్తు చేయ‌టంలో ఆలస్యం చేయకూడదు.. ఎందుకంటే ముందుగా దరఖాస్తు చేసిన వారికి తమకు అనుకూలమైన పరీక్ష కేంద్రం కేటాయించే అవకాశం ఎక్కువ.

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | టిఎస్-ప్రివియస్‌ పేపర్స్ | గెస్ట్ కాలమ్

దరఖాస్తు చేసేటప్పుడు ముఖ్యమైన సూచనలు

  • పుట్టిన తేదీ స్పష్టంగా నమోదు చేయాలి – ఇంటర్మీడియట్ ధృవీకరణ పత్రంలో ఉన్న పుట్టిన తేదీనే నమోదు చేయాలి.
  • కుల ధృవీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి.
  • స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు – సంబంధిత అధికారుల ధృవీకరణ తప్పనిసరి.
  • తండ్రి పేరు & సంతకం – ముందుగా ధృవీకరించుకోవడం మంచిది.
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులో జాగ్రత్తలు తీసుకోవాలి – ఏదైనా సమస్య వస్తే TG EAPCET హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి.

దరఖాస్తు ప్రక్రియలో జాగ్రత్తలు

  • ముందుగా పేపర్ వర్క్ చేయాలి – అప్లికేషన్‌లో అవసరమైన కాలమ్స్‌ను ముందే పుస్తకంలో రాసుకోవడం వల్ల తప్పులు తగ్గుతాయి.
  • ఫోటో & సిగ్నేచర్ అప్లోడ్ ఖచ్చితంగా ఉండాలి – తప్పులు ఉంటే వెంటనే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి.
  • ఏ సమస్య వచ్చినా టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి – తక్షణమే సెట్ కమిటీ స్పందిస్తుంది.

ఆఖరి నిమిషానికి దరఖాస్తును వాయిదా వేయకుండా ముందుగా పూర్తి చేయడం ఉత్తమం!

TG EAPCET 2025 ముఖ్యమైన తేదీలు

  • అగ్రి & ఫార్మసీ సెట్స్ – ఏప్రిల్ 29, 30
  • ఇంజినీరింగ్ సెట్స్ – మే 2 నుంచి 5 వరకు
  • దరఖాస్తు చివరి తేదీ – ఏప్రిల్ 4
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Current Affairs
Published date : 01 Mar 2025 01:14PM

Photo Stories