Skip to main content

TG LAWCET & PGLCET 2025 Schedule: లాసెట్, పీజీఎల్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

సాక్షి ఎడ్యుకేష‌న్‌: లా కోర్సుల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
TG LAWCET and PGLCET 2025 Schedule Release

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ లాసెట్‌, పీజీలాసెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు.
అర్హత: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసి ఉండాలి. ఎల్ఎల్ఎం చేయాలనుకునే వారు.. డిగ్రీతో పాటు ఎల్ఎల్ బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

చదవండి: లాసెట్ - స్టడీ మెటీరియల్ | లా ఆప్టిట్యూడ్ | అర్థిమేటిక్ | రీజనింగ్ | గైడెన్స్‌ | కరెంట్‌ అఫైర్స్ | జనరల్‌ నాలెడ్జ్‌

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఎడ్‌సెట్‌ షెడ్యూల్‌ ఇదే..

విష‌యం ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ ఫిబ్రవరి 25, 2025
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 1, 2025
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ (లేటు ఫీజు లేకుండా) ఏప్రిల్ 15, 2025
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ (లేటు ఫీజుతో) మే 25, 2025
పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) జూన్ 6, 2025
మూడుళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు: 9.30 to 11.00 & 12.30 to 2.00
ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ & ఎల్‌ఎల్‌ఎం కోర్సులు: 4.00 to 5.30

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://lawcetadm.tsche.ac.in/ ను సంప్రదించండి.

Published date : 10 Feb 2025 10:43AM

Photo Stories