Skip to main content

చదువు పూర్తవకముందే ఉద్యోగాలు.. ఈ కళాశాలలో ప్రత్యేక అవకాశాలు!

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక డెయిరీ కళాశాల కామారెడ్డిలో ఉంది. 1978లో ప్రారంభమైన ఈ కళాశాల నుంచి పలువురు విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సాధించి, వ్యాపారాల్లో స్థిరపడ్డారు.
kamareddy dairy technology college success story

బీఎస్సీ డెయిరీ కోర్సుతో ప్రారంభమైన ఈ కళాశాల ఇప్పుడు బీటెక్ డెయిరీ టెక్నాలజీ కోర్సుగా మారింది. విద్యార్థులకు చదువు పూర్తవకముందే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు లభించడం విశేషం. జెర్సీ డెయిరీ సహా రాష్ట్రంలోని ప్రముఖ డెయిరీ సంస్థల్లో పనిచేస్తున్నవారంతా ఇక్కడి విద్యార్థులే కావడం గర్వించదగిన విషయం.

కోర్సుల మార్పులు – విద్యార్థులకు మరిన్ని అవకాశాలు

1978లో కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలో బీఎస్సీ డెయిరీ కోర్సు ప్రారంభమైంది. కాలక్రమేణా బీటెక్ డెయిరీ కోర్సుగా మారింది. ఎంసెట్ (EAMCET) ద్వారా ప్రవేశాలను కేటాయిస్తున్నారు. 2007లో శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలోకి మార్చారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

చదవండి: TG ICET 2025: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల

kamareddydairytechnologycollege

విద్యార్థులకు ప్రత్యేకంగా సౌకర్యాలు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 60 ఎకరాల భూమిని కళాశాలకు కేటాయించి, రూ.11 కోట్లు మంజూరు చేశారు. కాలేజీ భవనం, బాలురు, బాలికల హాస్టళ్లు, ల్యాబ్‌లు, ఆడిటోరియం నిర్మించడంతో పాటు ప్రాక్టికల్ శిక్షణలో పాల పదార్థాలు తయారుచేసే డెయిరీ పార్లర్ నిర్వహణకు కూడా అవకాశం కల్పించారు. విద్యార్థులు కోవా, దూద్‌పేడా, రసగుల్లా, గులాబ్‌ జామ్‌ వంటి ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తారు.

విద్యార్థుల విజయాలు – దేశ, విదేశాల్లో ఉద్యోగాలు

ఈ కళాశాలలో ఇప్పటివరకు 900 మంది విద్యార్థులు డెయిరీ కోర్సు పూర్తి చేశారు. వారిలో చాలామంది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. కొందరు సొంతంగా డెయిరీ ఉత్పత్తుల సంస్థలు స్థాపించారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC) ద్వారా విజయ డెయిరీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సూపర్‌వైజర్ వంటి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
kamareddydairytechnologycollege

పీజీ కోర్సుల ఏర్పాటు అవసరం

పీజీ కోర్సులు (PG Courses) లభించకపోవడం వల్ల విద్యార్థులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే పీజీ కోర్సులు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

డెయిరీ కోర్సు భవిష్యత్తు – ఉద్యోగ భరోసా

బీటెక్ డెయిరీ టెక్నాలజీ చదివిన వారు ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. 40 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించగా, 35 సీట్లు ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారు. 5 సీట్లు రైతు కోటా ద్వారా భర్తీ చేస్తారు. టీఎస్‌డీడీసీ, విజయ డెయిరీ, జెర్సీ డెయిరీ వంటి సంస్థల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

"మా కళాశాల విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. రాష్ట్ర డెయిరీల్లోనూ మనవారే కీలక పాత్ర పోషిస్తున్నారు"

– డాక్టర్ ఉమాపతి, కళాశాల డీన్.

Published date : 24 Mar 2025 03:49PM

Photo Stories