Skip to main content

PJTSAU: వ్యవసాయ కోర్సులకు కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అందిస్తున్న బీఎస్సీ (హాన్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (హాన్స్‌) కమ్యూనిటీ సైన్స్, బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌ (బీఎఫ్‌ఎస్సీ), బీఎస్సీ (హాన్స్‌) హార్టీకల్చర్‌ కోర్సుల లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం మొదటి దశ కౌన్సెలింగ్‌ అక్టోబర్ 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తామని వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.రఘురామిరెడ్డి అక్టోబర్ 6న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Counselling Schedule for admission into Various Diploma Courses  Telangana Agricultural University counseling 2024

అందుకు తెలంగాణ ఎంసెట్‌ – 2024 పరీక్షలో అర్హత పొంది, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి ర్యాంకు ఆధారంగా నిర్ణీత షెడ్యూల్‌ రోజు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు షెడ్యూల్లో పేర్కొన్న అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, నిర్ణీత రుసుముతో రావాలని కోరారు. కౌన్సెలింగ్‌ రోజే ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తారు.

చదవండి: Agriculture Course: సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కౌన్సెలింగ్‌లో ఎంసెట్‌ పరీక్షలో అభ్యర్థుల మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. కౌన్సెలింగ్‌ షెడ్యూల్, ఇతర వివరాల కోసం అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ – www. pjtsau.edu.in ను సందర్శించాలని కోరారు.

Published date : 07 Oct 2024 03:39PM

Photo Stories