Legal Service Authority: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు
Sakshi Education
ఖమ్మం వైద్యవిభాగం/ఖమ్మం లీగల్: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖరరావు సూచించారు.
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇటీవల ఘటనల నేపధ్యాన నవంబర్ 19న న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు.
చదవండి: China Cutting: విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు..
అనంతరం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ ర్యాగింగ్ చేస్తే భవిష్యత్ బలవుతుందని చెప్పారు. విద్యార్థులు చదువుపై మాత్రమే శ్రద్ధ వహిస్తూ చట్టాలను తెలుసుకుని నడుచుకోవాలని సూచించారు.
ఈ సదస్సులో టౌన్ ఏసీపీ రమణమూర్తి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మామిడి హన్మంతతరావు తదితరులు పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 21 Nov 2024 10:22AM