Skip to main content

ఇందిరమ్మ ‘Mahila Shakti’కి దరఖాస్తుల ఆహ్వానం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్‌లు అందించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి డిసెంబ‌ర్ 20న‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Indiramma Mahila Shakti Scheme  Indiramma Mahila Shakti program for minority women

మైనార్టీ మహిళలు డిసెంబ‌ర్ 31వ తేదీ వరకు tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నిరుపేద, నిరాశ్రయులు, వితంతువు, విడాకులైన మహిళలు, అనాథ, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: Free Coaching: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఉద్యోగ అవకాశం కూడా..

తెల్లరేషన్‌ కార్డు, ఆహారభద్రత కార్డు రెండు లేకపోతే గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.50లక్షలు, పట్టణప్రాంతం వారికి రూ.2 లక్షలు మించకుండా ఆదాయ ధ్రువపత్రం ఉండాలని పేర్కొన్నారు.

నివాస ధ్రువీకరణ కోసం ఆధార్‌కార్డు, 18–55 ఏళ్ల వారు ఈ పథకం అర్హులని, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా టైలరింగ్‌ సర్టిఫికెట్‌, కనీసం 5వ తరగతి విద్య అర్హత ఉండాలని తెలిపారు.

Published date : 23 Dec 2024 10:37AM

Photo Stories