China Cutting: విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు..
ఖమ్మంలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి నవంబర్ 12న చైనా దేశంలో మాదిరి కటింగ్ చేయించుకోగా సీనియర్ విద్యార్థులు మందలించారు.
దీంతో అతను ట్రిమ్ చేయించుకున్నాడు. ఇదిలా ఉండగా కాలేజీ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్.. ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక సెలూన్‌కు తీసుకెళ్లి గుండు చేయించాడు.
చదవండి: Ragging: పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్.. విద్యార్థుల సస్పెన్షన్
ఈ ఘటనతో మనస్తాపం చెందిన విద్యార్థి ప్రిన్సిపాల్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటికప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుంచి తొలగించగా, డీఎంఈ ఆదేశాలతో త్రిసభ్య కమిటీని నియమించారు.
ఈ కమిటీ విచారణ అనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవర్తన సరిగా లేదని, విద్యార్థికి గుండు కొట్టించిన విషయం నిజమేనని నివేదిక ఇవ్వడంతో రెహమాన్‌ను సస్పెండ్ చేస్తూ వైద్య విద్య డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.