TG EAPCET 2024: ఈఏపీ సెట్ ద్వారా ఇన్ని బైపీసీ సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీజీఈఏపీ సెట్ (బైపీసీ) అర్హత సాధించిన 10,436 మందికి అక్టోబర్ 28న తొలిదశలో సీట్లు కేటాయించినట్టు సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.
బీఫార్మసీ కోర్సుకు సంబంధించి 127 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 8,845 సీట్లు ఉంటే, 8,453 సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఫార్మాడీకి సంబంధించి 74 కాలేజీల్లో 1,648 సీట్లు అందుబాటులో ఉంటే, 1,627 సీట్లు కేటాయించామని తెలిపారు.
చదవండి: JEE Mains 2025 Schedule: జేఈఈ మెయిన్స్–2025 షెడ్యూల్ విడుదల.. సెక్షన్–బీలో చాయిస్ ఎత్తివేత
బయోమెడి కల్‌లో 2 కాలేజీల్లో 58 సీట్లు ఉంటే మొత్తం కేటాయించామని, ఫార్మాస్యూటికల్స్‌లో 3 కాలేజీల్లో 122 సీట్లు ఉంటే, 117 సీట్లు భర్తీ చేశామని వెల్లడించారు. బయో టెక్నాలజీలో 4 కాలేజీల్లో 181 సీట్లు ఉంటే మొత్తం భర్తీ అయి నట్టు పేర్కొన్నారు. ఫార్మసీలో 54 కాలేజీల్లో వంద శాతం సీట్ల కేటాయింపు ఉన్నట్టు స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 30 తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.
Published date : 29 Oct 2024 05:27PM