Skip to main content

Admissions: ‘అగ్రి’ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రారంభం

సాక్షి,హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ, వెట ర్నరీ, ఉద్యాన యూజీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌) కోర్సులలో ప్రవేశాలకు అక్టోబర్ 14న కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది.
Counselling for admission to Agri courses has started  Prof. Jayashankar Telangana Agricultural University campus during admissions

రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ కౌన్సెలింగ్‌ను రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.రఘురామి రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన కోర్సులలో చేరడం వల్ల విద్యార్థులకు లభించే ఉపాధి, ఉన్నత విద్య అవకాశాల గురించి ఆయా విశ్వవిద్యాలయాల అధికారులు ఈ సందర్భంగా వివరించారు.

చదవండి: AgriCet Ranker Navya : అగ్రి సెట్‌లో 19వ ర్యాంకు.. ఈ ల‌క్ష్యం కోస‌మే.

ఈ కార్య క్రమంలో వెటర్నరీ విశ్వవిద్యాలయం రిజి స్ట్రార్‌ డాక్టర్‌ గోపాల్‌రెడ్డి, వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ జయశ్రీ, డీన్‌ ఆఫ్‌ కమ్యూనిటీ సైన్స్‌ డాక్టర్‌ విజయలక్ష్మి, ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Published date : 16 Oct 2024 09:50AM

Photo Stories