Skip to main content

Agriculture Polytechnic: అగ్రి కోర్సులతో కచ్చితమైన ఉపాధి.. తక్కువ ఫీజుకే నాణ్యమైన వ్యవసాయ విద్యా కోర్సులు

బుక్కరాయసముద్రం: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు కూడా అంత సులువుగా లభ్యం కావడం లేదు.
Agriculture Polytechnic Admission started

దీంతో ప్రతి ఒక్కరిలోనూ పదో తరగతి పరీక్షలు రాయగానే నెక్ట్స్‌ ఏమిటనే ప్రశ్న వ్యక్తమవుతూ ఉంటుంది. అయితే పదో తరగతి ఉత్తీర్ణత కాగానే రెండేళ్ల కాల వ్యవధి ఉన్న అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేయగలిగితే కేవలం 19 ఏళ్ల వయసులోనే కొలువులు దక్కడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

జూన్‌ 1 నుంచి 20వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వసుంధర తెలిపారు. జిల్లాలోని రెడ్డిపల్లి కృషివిజ్ఞాన కేంద్రంతో పాటు శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిరలో ప్రభుత్వ యాజమాన్యంలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. అలాగే అనంతపురం, తాడిపత్రితో పాటు శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి.

విద్యార్హతలు ఇలా..
పదో తరగతి ఉత్తీర్ణత అయి 15 నుంచి 22 సంవత్సరాల్లోపు వయసున్న వారికి అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. www.angrau.ac.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. పూర్తి సమాచారానికి ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.

RGUKT Basara Campus: బాసర ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్‌ కోసం..

సీట్ల కేటాయింపు ఫీజులు ఇలా..
అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 6 శాతం, బాలికలకు 33 శాతం, అంగ వైకల్యం కలిగిన వారికి 3 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రవేశ అర్హత పొందిన వారు ఏడాదికి రూ.8,800 చెల్లించాలి. హాస్టల్‌లో వసతి పొందేందుకు రూ.11 వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తి అయిన తర్వాత డిపాజిట్‌ సొమ్మును వెనక్కు చెల్లిస్తారు. ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రభుత్వ నిర్దేశించిన మేరకు ఏడాదికి రూ.29 వేలు ఫీజు, హాస్టల్‌కు సంబంధించి నెలకు రూ.5,500 చెల్లించాల్సి ఉంటుంది.

చాలా మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు
మా కళాశాలలో చదివిన పిల్లలు చాలా మంది ఇప్పుడు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సులకు మంచి భవిష్యత్తు ఉంది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 1 నుంచి 20వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్‌ వసుంధర, ప్రిన్సిపాల్‌, రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల

Student Tracking System: ప్రతి విద్యార్థికీ ‘పెన్‌’.. విద్యార్థుల ట్రాకింగ్‌ కోసం కొత్త విధానం

Published date : 03 Jun 2024 10:55AM

Photo Stories