Government Jobs for Youth : ఇప్పటికి 55,172 ఉద్యోగాలను భర్తీ చేశాం ఇలా.. ఇంకా..
సాక్షి ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి స్పష్టం చేస్తూ పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క. నోటిఫికేషన్ విడుదల చేయడం అంటే ఉద్యోగం ఇవ్వడం కాదని అన్నారు. ఇది గత పాలకుల విధానమన్నారు విక్రమార్క.
Job Recruitments : ఈ ఉద్యోగాల్లో నియామకాలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. నెలాఖరులోగా..!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55,172 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేశామన్నారు. గత పది సంవత్సరాలపాటు ఉద్యోగ నియామకాలు లేక యువకులు అల్లాడిపోయారని.. ఉద్యోగాల కోసం యువత ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని గుర్తు చేశారు. టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.
నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొంత సమయంలోనే 55 నుంచి 56 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి వాటిని భర్తీ చేశామని తెలిపారు. గత పాలకులు పదేళ్ల కాలంలో గ్రూప్-1 పరీక్ష ఒక్కసారి కూడా నిర్వహించలేకపోయారు, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు అన్నారు.
మేము అధికారంలోకి వచ్చిన తరువాత పాత ఖాళీలు, కొత్త ఖాళీలు అన్నీ కలిపి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేశాం. ఈ పరీక్షలను ఆపాలని కావాలనే కొద్దిమంది కోర్టుకు వెళ్లారు కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం 563 పోస్టులకు పరీక్ష నిర్వహించాము, 11062 ఖాళీలతో డీఎస్సీ నిర్వహించి 10,600 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు.
ఉద్యోగ నియామక పరీక్షలన్నీ పారదర్శకంగా, ప్రశ్నాపత్రం లీక్ వంటివి లేకుండా చూసుకుంటూ ఖాళీలను భర్తీ చేసుకుంటూ పోతున్నామని వివరించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం దశలవారీగా భర్తీ చేసుకుంటూ ముందుకు పోతాం అన్నారు. ఉర్దూ మీడియం లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి డీ రిజర్వేషన్ విధానం పరిశీలించాలని కొందరు సభ్యులు అడిగారు కానీ అందుకు అవకాశం లేదని తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2024
- job calender
- Unemployed Youth
- Telangana Government
- education for students
- job recruitments for youth
- Congress government
- jobs for youth
- Govt Jobs
- job related exams
- job notifications 2024
- group 1 notifications
- Deputy CM Bhatti Vikramarka
- youth jobs 2024
- govt jobs exams
- unemployed youth recruitments
- recruitments in telangana for unemployed youth
- Employment opportunity
- telangana cm revanth reddy
- Job Notifications in Telangana
- latest job recruitments
- Education News
- Sakshi Education News
- Government policies
- job opportunities
- Job Creation
- youth jobs