Good News for Students : విద్యార్థులకు శుభవార్త.. 15 రోజులు సెలవులు.. ఈ తేదీల్లోనే..
సాక్షి ఎడ్యుకేషన్: సెలవులంటేనే విద్యార్థులకు పండుగ. అందులోనూ ఇది చలికాలం.. దీంతో రోజురోజుకి చలి తీవ్రత పెరగడం, వర్షాలు పడడం వంటివి జరిగేసరికి విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్య సెలవులను ప్రకటిస్తుంటారు ప్రభుత్వాలు. ఇక దేశంలో చలి తీవ్రత కూడా ఎంతో పెరుగుతూనే ఉంది.
ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగిపోయింది.
విద్యాసంస్థలకు ఏకంగా 15రోజులు..
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. దీంతో హర్యానా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ విపరీతమైన చలి ఉండటంతో ఏకంగా రెండు వారాల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్, అంగన్‌వాడీ కేంద్రాలను సైతం మూసివేయాలని ప్రకటించింది హర్యానా ప్రభుత్వం. రాష్ట్రంలో తీవ్రమైన చలికాల పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ఈ మెరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
School Fees: స్కూళ్ల ఫీ‘జులుం’కు చెక్!.. ప్రైవేటు స్కూళ్ల వాదన ఇలా..
చలి తీవ్రత కారణంగా.. ప్రభుత్వ, ప్రైవేట్-ఎయిడెడ్ పాఠశాలల పాఠశాల సమయాలను ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటలకు మార్చారు. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలను చలి నుంచి కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 16వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.
విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్య..
ఇదిలా ఉండగా, చలికాలంలో విద్యార్థులు ఎక్కువగా అనారోగ్యం బారినపడి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టు ప్రభుత్వం వివరించింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ సహా ప్రైవేట్ విద్యా సంస్థలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను తప్పనిసరిగా అనుసరించాలని పాఠశాలల యాజమాన్యాన్ని విద్యాశాఖ కోరింది. కాని, బోర్డు పరీక్షలు రాసే 10, 12వ తరగతుల విద్యార్థులను ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Schools Holidays
- Education Institutions
- Haryana government
- govt and private schools holidays
- 15 days holidays news
- schools holidays news latest
- winter season holidays for schools
- schools and colleges holidays
- holidays announcement in haryana
- Himachal Pradesh
- Punjab
- schools and colleges holidays in winter season
- january 2025 holidays list
- holidays in 2025
- resume of college practicals
- students health
- january 1st to 15th
- 15 days holidays for schools and colleges
- Education Department
- weather changes
- holidays for schools and colleges due to weather change
- climate change holidays for schools and colleges
- Education News
- Sakshi Education News