Skip to main content

American Visa : అమెరికాలో గ‌ణ‌నీయంగా పెరిగిన భార‌తీయుల సంఖ్య‌.. ఈసారి 10 ల‌క్ష‌ల వీసాల్లో..

భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది.
Highest number of american visa consists of indian citizens

సాక్షి ఎడ్యుకేష‌న్: భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ 'నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా'లను జారీ చేసింది.

America National Bird : దశాబ్దాలుగా అమెరికా అధికార చిహ్నంగా.. ఇక‌పై జాతీయ పక్షిగా!

గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో చదువుకోవడానికి వెల్లవారు మాత్రమే కాకుండా, సందర్శనార్ధం వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఇటీవల జారీ చేసిన 10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలలో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు (పర్యాటకుల వీసాలు) ఉన్నట్లు సమాచారం.

Year Ender 2024: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన 10 అంశాలు ఇవే..

4 సంవ‌త్స‌రాల్లో.. 5 రెట్లు..

హెచ్-1బీ (H-1B) వీసాల రెన్యువల్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అమలు చేసింది. దీని వల్ల ఎంతోమంది భారతీయులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాగా.. గత నాలుగు సంవత్సరాలలో భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే సందర్శకుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. 2024 మొదటి 11 నెలల్లో 20 లక్షల కంటే ఎక్కువ మంది ఇండియన్స్ యుఎస్‌ వెళ్లారు. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 26 శాతం ఎక్కువ.

ఇప్పటికే 50 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు యుఎస్‌ని సందర్శించడానికి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వీసాలను ప్రతిరోజూ జారీ చేస్తున్నట్లు రాయబార కార్యాలయం  వెల్లడించింది. చదువుకోవడానికి ఇండియా నుంచి అమెరికా (America) వెళ్లే విద్యార్థులకు కూడా వీసాలను జారీ చేస్తున్నారు. ఈ వీసాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అంటే అక్కడ ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు స్పష్టమవుతోంది. 2008 - 2009 విద్యాసంవత్సరంలో అమెరికాకు ఎక్కువ మంది విద్యార్థులను పంపిన దేశంగా 'భారత్' రికార్డ్ క్రియేట్ చేసింది. సుమారు 3,31,000 మంది భారతీయులు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు సమాచారం.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

రెండేళ్ల‌పాటు..

ఎక్స్‌ఛేంజ్ విజిటల్ వీసాలు పొందిన భారతీయులు కూడా యునైటెడ్ స్టేట్స్‌లో ఉండగలుగుతున్నారు. USలో వారి ప్రోగ్రామ్‌లను పూర్తి చేసిన తర్వాత రెండు సంవత్సరాల పాటు అక్కడే ఉండవచ్చు. కాబట్టి ఇది వారి కెరీర్‌, విద్యను కొనసాగించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్స్‌ఛేంజ్ విజిటర్స్ స్కిల్స్ లిస్ట్ నుంచి ఇండియాను తొలగించడం వల్ల భారతీయ J-1 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్‌లకు ఎక్కువ సౌలభ్యం లభించింది. మొత్తం మీద భారతదేశం నుంచి అమెరికాకు వివిధ కారణాల వల్ల వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Dec 2024 01:13PM

Photo Stories