Skip to main content

Osamu Suzuki : దిగ్గ‌జ పారిశ్రామిక వేత్త‌.. ఒసాము సుజుకి.. ఈ పెరెలా..!

సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అయిన సుజుకి, 2021లో పదవీ విరమణ ప్ర‌క‌టించారు.
Interesting facts and successful story of osamu suzuki.. the industrialist

సాక్షి ఎడ్యుకేష‌న్: దిగ్గజ పారిశ్రామిక వేత్త 'ఒసాము సుజుకి' (Osamu Suzuki) తన 94ఏళ్ల వయసులో ఈ రోజు (డిసెంబర్ 25) తుదిశ్వాస విడిచారు. సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అయిన సుజుకి, 2021లో పదవీ విరమణ ప్ర‌క‌టించారు. ఇంతకీ ఎవ‌రీయ‌న‌? ఈయ‌న‌ ప్రస్థానం ఎలా మొదలైంది? సుజుకి కంపెనీలోకి ఎలా వచ్చారు? ఇంత ఉన్న‌త స్థాయికి ఎదిగిన ఒసాము సుజుకి జీవిత క‌థేంటి..! అనే ఆసక్తికరమైన విషయాలు, ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇక్కడ తెలుసుకుందాం..

American Visa : అమెరికాలో గ‌ణ‌నీయంగా పెరిగిన భార‌తీయుల సంఖ్య‌.. ఈసారి 10 ల‌క్ష‌ల వీసాల్లో..

పెళ్లితో మలుపు..

మత్సుడా.. షుంజో దంపతులకు 1930 జనవరి 30న జన్మించిన ఒసాము, 1953లో చువో యూనివర్సిటీలో త‌న‌ చదువును పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఈ త‌రువాత‌, 'మిచియో సుజుకి' మనవరాలు 'షోకో సుజుకి' ని ఆయ‌న వివాహం చేసుకున్నారు. ఈ వివాహంతో ఒసాము జీవితం మలుపు తిరిగింది.

ఒసాము సుజుకి పేరిలా..!

సుజుకి కుటుంబంలో వారసులు లేకపోవడం వల్ల మిచియో సుజుకి మనవరాలు 'షోకో సుజుకితో ఒసాము వివాహం చేసుకోవడంతో ఈయన జీవితం మలుపు తిరిగింది. జపనీస్ ఆచారాన్ని అనుసరించిన‌ ఒసాము.. సుజుకి ఇంటిపేరును స్వీకరించారు. దీంతో ఒసాము మత్సుడా నుంచి ఒసాము సుజుకి అయ్యారు.

America National Bird : దశాబ్దాలుగా అమెరికా అధికార చిహ్నంగా.. ఇక‌పై జాతీయ పక్షిగా!

జూనియర్ మేనేజ్‌మెంట్ నుంచి డైరెక్టర్ స్థాయికి

ఒసాము సుజుకి 1958లో సుజుకి మోటార్ కార్పోరేషన్‌లో చేరారు. కంపెనీలో జూనియర్ మేనేజ్‌మెంట్ పోస్టులతో సహా వివిధ విభాగాల్లో పనిచేస్తూ.. 1963లో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. 2000లో సుజుకి మోటార్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని చేపట్టారు. సుజుకి మోటార్ కార్పోరేషన్ అధిపతిగా మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన.. ఒసాము సుజుకి ప్రపంచ ఆటో పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతి తక్కువ కాలంలోనే సుజుకి కార్పొరేషన్‌ను ప్రపంచంలోని అతి పెద్ద చిన్న కార్ల తయారీ దారులలో ఒకటిగా మార్చారు. చిన్న కార్ల మార్కెట్‌ను విస్తరించడం ద్వారా సుజుకి కంపెనీ గణనీయమైన పురోగతిని సాధించింది. సుజుకి కంపెనీని భారతదేశంలోని తీసుకొచ్చిన ఘనత కూడా ఒసాము సొంతం.

యూరోపియన్ మార్కెట్‌లోకి ప్రవేశం


సుజుకి మోటార్ కార్పోరేషన్ ఉనికిని విస్తరిస్తూ.. విదేశాలలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ప్రారభించారు. ఇలా ఏర్పడిన ప్లాంట్‌లలో మొదటిది థాయిలాండ్‌లో ఉంది. ఆ తరువాత ఇండోనేషియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లలో కూడా కంపెనీ ప్లాంట్స్ ఏర్పాటు అయ్యాయి.

Year Ender 2024: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన 10 అంశాలు ఇవే..

అదే సమయంలో జనరల్ మోటార్స్‌తో కలిసి ప్రయాణం మొదలు పెట్టిన.. సుజుకి కార్పొరేషన్‌ను యూరోపియన్ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించింది. జపాన్‌కు మాత్రమే పరిమితమైన సంస్థను ఒసాము నలుదిశలా వ్యాపింపజేశారు.

31 దేశాలలో 60 ప్లాంట్‌లు

ఒసాము సుజుకి సారథ్యంలో ఎదిగిన కంపెనీ 21వ శతాబ్దం ప్రారంభం నాటికి 31 దేశాలలో 60 ప్లాంట్‌లను కలిగి ఉంది. సుమారు 190 దేశాలలో విక్రయాలను సాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చిన్న కార్ల విభాగంలో మాత్రమే కాకుండా.. టూ వీలర్ విభాగంలో కూడా ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. పారిశ్రామిక రంగంలో ఒసాము సుజుకి చేసిన సేవలకు భారత ప్రభుత్వం 'పద్మ భూషణ్'తో సత్కరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం.. సితార ఏ పాకిస్తాన్ అవార్డును ప్రధానం చేసింది. ఓ బ్యాంకు ఉద్యోగి స్థాయి నుంచి ప్రపంచమే గుర్తించేలా ఎదిగిన 'ఒసాము'.. పారిశ్రామిక రంగంలో ఓ ధ్రువతార అనే చెప్పాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Dec 2024 04:08PM

Photo Stories