Skip to main content

SBI Probationary Officer jobs: డిగ్రీ అర్హతతో SBIలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలు జీతం నెలకు 48480

State Bank of India
State Bank of India

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సంస్థ నుండి 600 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాల భర్తీ కొరకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం Free Credit Card scheme రూ. 3 లక్షల Loan: Click Here

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) సంస్థ దేశ వ్యాప్తంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

భర్తీ చేయబోయే ఉద్యోగాలు : ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య :  600 ఉద్యోగాల భర్తీ జరగనుంది.

ఖాళీలు కేటగిరీ వారీగా క్రింది విధంగా విభజించబడ్డాయి.
ఎస్సీ – 87
ఎస్టీ – 57
ఓబీసీ – 158
EWS – 58
యు ఆర్ – 240

విద్యార్హత : 
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
ప్రస్తుతం ఫైనల్ ఇయర్ / ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.అయితే వారు ఇంటర్వ్యూ నిర్వహణ నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి వుండాలి.
విద్యార్హత నిర్ధారణ కొరకు 30/04/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

వయస్సు :
అర్హత గల అభ్యర్థులు వయస్సు 21 సంవత్సరాలు నిండి వుండి 30 సంవత్సరాలలోపు గా వుండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు వయస్సులో మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PWBD వారికి 10 సంవత్సరాలు
 Ex – సర్వీస్ మాన్ వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
వయస్సు నిర్ధారణ కొరకు 01/04/2024ను కట్ ఆఫ్ తేదిగా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు: 
జనరల్ , EWS , OBC అభ్యర్థులు 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎస్సీ , ఎస్టీ , PwBD , ఎక్స్ సర్విస్ మెన్ అభ్యర్థులు ఎటువంటి  అప్లికేషన్ ఫీజు  చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక కు 3 దశలు ఉంటాయి.
అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ & మెయిన్స్) , సైకోమెట్రిక్ పరీక్ష , గ్రూప్ ఎక్సర్సైజ్ , పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

Online పరీక్షా విధానం:
ప్రిలిమినరీ లో మొత్తం 100 మార్కులకు గాను , 100 ప్రశ్నలు ఇస్తారు ,ఇవి బహులైచ్చిక ప్రశ్నలు ఇందులో రీజనింగ్ ( 30 ప్రశ్నలు) ,క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ( 30 ప్రశ్నలు ) ,   ఇంగ్లీష్ ( 40 ప్రశ్నలు) సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వుంటాయి. 60 నిముషాల కాల పరిమితిలో సెక్షన్ వారీగా ( ఒక్కో సెక్షన్ కు 20 నిముషాల చొప్పున ) సమయం మార్కులు ,ప్రశ్నలు నిర్ధారిస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష లో సెక్షనల్ కటాఫ్ వుండదు. ప్రిలిమ్స్ పరీక్ష నుండి మెయిన్స్ కి 1:10 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.
మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు గాను 170 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్నెస్/ ఎకానమీ/ బ్యాంకింగ్ నాలెడ్జ్ , జనరల్ ఇంగ్లిష్ , డేటా అనాలసిస్& ఇంటర్ప్రిటేషన్ , రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు ఉంటాయి.
డిస్క్రిప్టివ్ పేపర్ (ఈమెయిల్ , రిపోర్ట్స్ , సిట్యువేషన్ అనాలసిస్, ప్రెసిస్ రైటింగ్) 50 మార్కులకు కేటాయించారు.
ప్రతి తప్పు సమాధానానికి ¼ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.

పరీక్ష కేంద్రాలు: 
దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు   తెలుగు రాష్ట్రాలలో కూడా పలు నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ :  చిత్తూరు, ఏలూరు , గుంటూరు/ విజయవాడ , కడప , కాకినాడ , కర్నూలు, నెల్లూరు , ఒంగోలు , రాజమండ్రి , శ్రీకాకుళం , తిరుపతి , విశాఖపట్నం , విజయనగరం కేంద్రాలను ఎంపిక చేశారు.
తెలంగాణ : హైదరాబాద్ , ఖమ్మం , వరంగల్ , కరీంనగర్ కేంద్రాలను ఎంపిక చేశారు.

జీతం: 
అభ్యర్థులకు ప్రారంభ దశలో 48,480/-  బేసిక్ పే వర్తిస్తుంది.
సంవత్సరానికి 18.67 లక్షల జీతం లభిస్తుంది

ప్రొబేషన్ పీరియడ్: ఎంపిక కాబడిన అభ్యర్థులు 2 సంవత్సరాల పాటు ప్రొబెషన్ పీరియడ్ లో వుంటారు.

సర్వీస్ బాండ్: ఎంపిక కాబడిన అభ్యర్థులు 3 సంవత్సరాలు బ్యాంక్ వారి సర్వీస్ లో  పనిచేసే విధంగా 2 లక్షల రూపాయలకు బాండ్ కి కట్టుబడి వుండాలి.

ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 27/12/2024
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 16/01/2025
ప్రిలిమినరీ వ్రాత పరీక్ష మార్చి 2025 లో నిర్వహిస్తారు.
మెయిన్స్ వ్రాత పరీక్ష   ఏప్రిల్ / మే 2025 లో నిర్వహిస్తారు.
సైకోమెట్రిక్ టెస్ట్ నిర్వహణ & ఇంటర్వ్యూ & గ్రూప్ ఎక్సర్సైజ్ నిర్వహణ : మే/ జూన్ 2025.

Notification: Click Here

Apply Now: Click Here

Published date : 27 Dec 2024 03:58PM

Photo Stories