Skip to main content

Job Mela: 17న జాబ్‌మేళా.. టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు..

కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం ఆధ్వర్యాన డిసెంబ‌ర్ 17న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు డిసెంబ‌ర్ 15న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Job fair on 17th  Kakinada Job Fair announcement  Kakinada December 17 job fair details

టారస్‌ కంపెనీలో బీపీఓ, వరుణ్‌ మోటార్స్‌లో టీమ్‌ లీడర్‌, ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌, అడ్వైజర్‌, పెయింటర్‌ అండ్‌ డెంటర్‌, రిలయన్స్‌ ట్రెండ్స్‌లో రిటైల్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ఇండో ఎంఐఎం, హోండాస్‌ మోబీస్‌, పానసోనిక్‌ అండ్‌ కేఐఎంఎల్‌ కంపెనీల్లో టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు.

చదవండి: Job Mela 2024: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 18వేల వరకు..

ఈ ఉద్యోగాల కు టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులైన 30 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్‌లు, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌ ఆవరణలోని వికాస కార్యాలయానికి సర్టిఫికెట్ల జిరాక్సులతో హాజరు కావాలని లచ్చారావు సూచించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 17 Dec 2024 10:07AM

Photo Stories