EF EPI 2024: ఇంగ్లిష్ ప్రావీణ్యం అంతంతే.. అత్యద్భుతమైన ప్రావీణ్యం ఉన్న టాప్ 9 దేశాలు ఇవే..
ప్రభుత్వ రంగంలో పనిచేసేవారితో పోలిస్తే ప్రైవేటు రంగంలోని వారి భాషా నైపుణ్యాలు బాగున్నాయి. ఇఎఫ్ ఆంగ్ల భాషా ప్రావీణ్య సూచి (ఇఎఫ్ ఇపిఐ) 2024 నివేదికలో వెల్లడైన విషయాలివి. ఇఎఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్.. విద్యా రంగానికి సంబంధించిన ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాల్లో ఉంది.
చదవండి: T-SATలో వ్యవసాయ ప్రసారాలు
ప్రజల ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని అంచనా వేసేందుకు ఏటా ఈఎఫ్ టెస్ట్ నిర్వహించి.. ఏటా ఇఎఫ్ ఇపిఐ విడుదల చేస్తుంటుంది. అలా గతేడాది నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాల్లోని 21 లక్షల మంది పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఇందులో పాల్గొన్నవారి సగటు వయసు 26 ఏళ్లు. వారి వారి సామర్థ్యాలను బట్టి ఆయా దేశాలను.. అత్యద్భుతం, అద్భుతం, ఫర్వాలేదు, తక్కువ, చాలా తక్కువ విభాగాలుగా విభజించింది. ఇందులో మనదేశం తక్కువ ప్రావీణ్యం ఉన్న దేశాల జాబితాలో ఉంది. మన ర్యాంకు 69.