One Day Work Shop : ఈఎల్‌సీఎస్ ల్యాబ్‌లో ఇంగ్లీష్ ప్రావీణ్యం, విదేశ విద్యావకాశాలపై ఒకరోజు వర్స్‌షాప్..
డెంకాడ: విదేశాలలో విద్యావకాశం పొందడంలో ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కీలక పాత్ర వహిస్తుందని ప్రఖ్యాత ఐరిష్ స్కాలర్ డేవిడ్ ఫాలన్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన లెండి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ (ఈఎల్‌సీఎస్) ల్యాబ్‌లో ఇంగ్లీష్ ప్రావీణ్యం, విదేశ విద్యావకాశాలపై జరిగిన ఒకరోజు వర్స్‌షాప్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐర్లాండ్‌లోని సంస్థలపై ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇస్తూ యూరప్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల గురించి తన విస్తృత పరిజ్ఞానాన్ని పంచుకున్నారు.
విద్యావిషయక విజయాన్ని సాధించడంలో, విదేశాల్లో విద్యావకాశాలను పొందడంలో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరిస్తూ భారతదేశంలో విద్యార్థుల సంయమనాన్ని కొనియాడారు. 21వ శతాబ్దంలో వస్తున్న మార్పులకు దీటుగా ఇంజినీరింగ్ విద్యావిధానం మారబోతుందని అందుకు తగినట్లుగా ఉన్నత విద్యను అభ్యసించాలని అయన చెప్పారు. అంతర్జాతీయంగా తమ అధ్యయనాలను కొనసాగించాలని కోరుకునే విద్యార్థులకు ఆయన ప్రావీణ్యం, అవగాహనను రంగరించి విలువైన మార్గదర్శకత్వం చేశారు.
Yogi Vemana University: వైవీయూలో ఈ ఏడాది నుంచి డిగ్రీ కోర్సులు ప్రారంభం
లియో గ్లోబల్ ఓవర్సీస్, వైజాగ్ డివిజన్ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. లెండి ఇనిస్టిట్యూట్‌ల వైస్ ప్రిన్సిపాల్, సీనియర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ హరిబాబు తమ్మినేని..డేవిడ్ ఫాలన్‌కు కృత/్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌ఈవో వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ వాసవి కోన, అన్ని విభాగాధిపతులు పాల్గొనగా, శ్రావణి, జ్యోత్స్న, రేవతి, రెజ్వాన్, రాజా కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
B Vinod Kumar: ఉత్తర తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్