Skip to main content

Anganwadi Workers : పెంచ‌ని జీతాలు.. భ‌ర్తీకాని పోస్టులు.. ఆందోళ‌న‌బాట‌లో అంగ‌న్వాడీలు..!

త‌మ డిమాండ్‌ల‌ను ప‌రిశీలించి, ప్ర‌భుత్వం స్పందించాల‌ని కోరుతూ అంగ‌న్వాడీ ఉద్యోగులు ధ‌ర్నా చేప‌ట్టారు.
Anganwadi workers demand for salaries and filling various posts

సాక్షి ఎడ్యుకేష‌న్: త‌మ జీతాలు పెంచుతామ‌ని, అడిగిన వెసుబాటుల ఏర్పాట్లు చేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ స‌ర్కార్ ఇచ్చిన హామీలు, ప‌థ‌కాలు ఇప్పుడేమ‌య్యాయి అని అంగ‌న్వాడీలు ధ‌ర్నాకు దిగారు. గురువారం ఇందిరాపార్క్‌ వద్ద అంగ‌న్వాడీ ఉద్యోగులు త‌మ జీతాలు పెంచాల‌ని, అంగ‌న్వాడీల్లో ఖాళీగా ఉన్న టీచ‌ర్ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేసిన ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి స్పంద‌న రాలేద‌ని ధ‌ర్న చేప‌ట్టారు. నేడు ఇందిరాపార్క్‌ వద్ద తలపెట్టిన ధర్నాకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది.

Schools and Colleges Holidays : ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఎందుకంటే?

జీతాల పెంపు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌..

కాంగ్రెస్ ప్ర‌భుత్వ అధికారంలోకి వ‌చ్చి ఏడాది దాటిపోయింది. అయినప్ప‌టికీ, ఇంత వ‌ర‌కు అడిగినా, డిమాండ్ చేసినవి ఇప్ప‌టివ‌ర‌కు అమ‌లు చేయ‌లేదు. అంగ‌న్వాడీల్లో 15,000 టీచ‌ర్ల పోస్టులు, ఆయాల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. రూ. 13650 ఇది ప్రస్తుతం అంగ‌న్వాడీల‌ జీతం. దీనిని, 18 వేలు చేయాల‌ని కోరినా, ఇప్ప‌టివ‌ర‌కు ప‌ట్టించుకోలేదు. డిమాండ్ చేసినా ప‌ట్టించుకోలేదు. అందుకే ధ‌ర్నా చేప‌ట్టాం అంటున్నారు అంగ‌న్వాడీ ఉద్యోగులు.

DOST Admissions Breaking News: డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు సర్కార్‌ స్వస్తి చెప్పే యోచన ... త్వరలో ప్రభుత్వానికి నివేదిక

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కింద అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష చెల్లిస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్‌ సర్కారు హామీ ఇచ్చింది. కాని ఇప్ప‌టికీ ఊసే లేదు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌తీ ఒక్క డిమాండ్‌ను రిక్వెస్ట్‌గానే అడినా, డిమాండ్ చేసినా ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి స్పంద‌న లేదని ధ‌ర్న‌కు దిగాం అని వివ‌రించారు అంగన్‌వాడీల సంఘం నాయకులు జయలక్ష్మి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Dec 2024 11:38AM

Photo Stories