Skip to main content

Yogi Vemana University: వైవీయూలో ఈ ఏడాది నుంచి డిగ్రీ కోర్సులు ప్రారంభం

PG college principal Acharya S. at a press conference  Press conference at CP Brown Language Research Center in Kadapa  Yogi Vemana University  University in-charge registrar Acharya S. introducing degree courses

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో 2024 –25విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డి పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలోని సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో దూరవిద్య కేంద్రం సంచాలకులు ఆచార్య కె. కృష్ణారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 6న జాబ్‌మేళా

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)– 2020ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (హానర్స్‌) ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బీకాం కంప్యూటర్స్‌ కోర్సులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మేజర్‌ సబ్జెక్టులుగా బీకాం కంప్యూటర్స్‌ కోర్సులో 60 సీట్లు, ఫిజిక్స్‌లో 30, కెమిస్ట్రీలో 40 సీట్లు చొప్పున ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

Skill Training Programme: ఐసీటీ కంపెనీతో కలిసి 48వేలమంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్న ఇన్ఫోసిస్‌

విద్యార్థులు ఈ కోర్సులు చదవడం ద్వారా భవిష్యత్తు–ఆధారిత విద్య లభించడంతోపాటు ఎంచుకున్న రంగంలో లోతైన నైపుణ్యాన్ని గడిస్తారన్నారు. తద్వారా గ్రాడ్యుయేట్‌లను జాబ్‌ మార్కెట్‌ కు సరిపడా జ్ఞానము, స్కిల్‌ పొంది సమాజ భవిష్యత్తు అవసరాలు తీర్చగల యొక్క పౌరులుగా తయారవుతారన్నారు.

Published date : 05 Jul 2024 09:15AM

Photo Stories