Skip to main content

Boeing Layoffs: 17,000 మంది ఉద్యోగుల తొలగింపు!.. ఇప్పటికే పింక్‌ స్లిప్పులు జారీ

ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి రంగం సిద్ధమైంది. ఈ ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే చాలా మందికి పింక్‌ స్లిప్పులు పంపిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి పొందిన వారు రెండు నెలలపాటు అంటే జనవరి వరకు నోటీస్‌ పీడియడ్‌లో ఉండబోతున్నట్లు స్పష్టం చేసింది.
Boeing Layoffs Boeing 17,000 jobs Layoffs
Boeing Layoffs Boeing 17,000 jobs Layoffs

కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉండడమే ఈ లేఆఫ్‌లకు కారణమని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకుంటామని చెప్పారు.  ఇటీవల సియాటెల్‌ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులకుపైగా సమ్మెకు దిగారు.

CM Revanth Reddy Attends Mock Assembly: అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని గతంలో కంపెనీ సీఈఓ పేర్కొన్నారు.

Police Jobs: భారీ జీతంతో ఎస్సై,హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ పోస్టులు..

సంస్థ తొలగించే ఉద్యోగుల్లో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగిస్తున్నారనే స్పష్టమైన వివరాలు మాత్రం తెలియరాలేదు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 16 Nov 2024 11:16AM

Photo Stories