Skip to main content

Tech layoffs 2024: ఇంటెల్‌ కంపెనీలో భారీగా ఉద్యోగుల తొలగింపు.. కారణమిదే!

టెక్‌ ఇండస్ట్రీలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ చిప్ తయారీ సంస్థ 'ఇంటెల్' (Intel) కూడా చేరింది. మొత్తం 1300 మంది ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Tech layoffs 2024    Intel layoffs in the tech industry

నవంబర్‌ 15 నుంచి రెండువారాల పాటు లేఆఫ్స్‌ కొనసాగుతాయని వెల్లడించింది. ఇంటెల్ లాభాలు గణనీయంగా తగ్గడం, వడ్డీ రేట్ల పెరుగుదల, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పాత్ర వంటి పలు కారణాలతో వందలాది మంది ఉద్యోగులను తొలగించనుంది. సంస్థల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి పలు టాప్‌ కంపెనీలు సైతం భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

Job Mela: డిగ్రీ అర్హతతో ఈనెల 26న జాబ్‌మేళా

మైక్రోసాఫ్ట్‌ కూడా ఇప్పటికే 3వేలకు పైగా ఉద్యోగులను తొలగించింది. గూగుల్‌, యాపిల్‌, మెటా వంటి ప్రముఖ టెక్‌ కంపెనీలు సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఇలా వివిధ సంస్థలు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 1.3 లక్షల కంటే ఎక్కువమందిని తొలగించినట్లు సమాచారం. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 25 Oct 2024 09:11AM

Photo Stories