Goodnews For TCS Employees: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన TCS.. జీతాల పెంపుపై కీలక ప్రకటన
Sakshi Education
టెక్ పరిశ్రమలో కొంత కాలంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడం మాత్రమే కాకుండా.. వేతనాల పెంపుకు సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేసింది.
Goodnews For TCS Employees
2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వేతనాల పెంపుకు సంబంధించిన లెటర్లను.. మార్చి చివరి నాటికి ఉద్యోగులకు అందించనుంది. ఏప్రిల్ నుంచి పెరిగిన జీతాలతో.. చెల్లింపులు మొదలవుతాయి. అయితే వేతన పెంపు 4 శాతం నుంచి 8 శాతం వరకు ఉండే అవకాశం ఉందని అంచనా.
వేతనాలు 2023-24 ఆర్ధిక సంవత్సరం 7.9 శాతం, 2022-23లో 10.5 శాతం పెరిగాయి. అయితే ఈ సారి మాత్రం ఎంత పెరుగుతుంది అనే విషయం అధికారికంగా వెల్లడి కాలేదు. అక్టోబర్ - డిసెంబర్ కాలానికి ఫిబ్రవరిలో కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక వేరియబుల్ పే (QVP) తర్వాత.. దానికి అర్హతగల ఉద్యోగులకు వస్తుంది. సీనియర్ స్థాయి ఉద్యోగులు 20 శాతం నుంచి 40 శాతం వరకు తక్కువ చెల్లింపులను పొందుతూనే ఉన్నారు.