JNTUA Btech Results Out: బీటెక్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్‌తో ఇలా చెక్ చేసుకోండి
Sakshi Education
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 2024 నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన బీటెక్ మూడో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–20) రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ , రెండో సెమిస్టర్ (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి.
JNTUA Btech Results Out
వీటి వివరాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఫలితాల కోసం జేఎన్‌టీయూ వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు.
ఫలితాలు చూసుకోవడం ఎలా?
ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్https://jntuaresults.ac.in/ను క్లిక్ చేయండి.