Technical Certificate Course Exams: ఈనెల 19 నుంచి టీసీసీ పరీక్షలు.. ఇవి తప్పనిసరి
Sakshi Education
భీమవరం: డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. పరీక్షలకు హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పట్టణంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్ హైస్కూల్లో నిర్వహిస్తామన్నారు.
Technical Certificate Course Exams
జిల్లా వ్యాప్తంగా 131 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు 19 నుంచి 22 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు జరుగుతాయని టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలు 19 నుంచి 20 వరకు నిర్వహిస్తామన్నారు. సొంత కుట్టుమిషన్, హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు తీసుకుని పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని తెలిపారు.