Skip to main content

OU Ph D Notification 2025 : ఓయూలో పీహెచ్‌డీ 2025 ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు.. వీరు మాత్ర‌మే అర్హులు..

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ కోర్సుల‌పై కీల‌క అప్‌డేట్ వ‌చ్చేసింది.
PhD opportunities at Osmania University for degree and PG graduates   Osmania University PhD admission announcement  Ph D entrance exam 2025 notification for ou admission   PhD course update at Osmania University   Eligibility for PhD courses at Osmania University

సాక్షి ఎడ్యుకేష‌న్: ఉస్మానియా యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ కోర్సుల‌పై కీల‌క అప్‌డేట్ వ‌చ్చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఈ అవ‌కాశాల‌న్ని వినియోగించుకోండి. డిగ్రీ, పీజీ విద్య పూర్తి చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ఈ కోర్సుల్లో ద‌ర‌ఖాస్తులు చేసుకునే అర్హ‌త ఉంటుంది.

NIFT Admissions : నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు

జాతీయ స్థాయిలో జూనియర్‌ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించిన వారు, యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్‌, ఐసీఎంఆర్‌, డీబీటీ, ఇన్స్పైర్‌ ఫెలోషిప్‌ల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తీర్ణులైన వారు కూడా ఎంట్రన్స్‌ ద్వారానే అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది. 

ముఖ్య‌మైన వివ‌రాలు..

అర్హ‌త‌: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు 50 శాతంతో మిగిలిన వారు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.

ద‌ర‌ఖాస్తుల ప్రారంభం తేదీ: జనవరి 30వ తేదీన ప్రారంభం.

ద‌రఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌లో.. https://www.ouadmissions.com/

NIT Admissions : నిట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు

దరఖాస్తుల చివరి తేదీ: మార్చి 1వ తేదీ

ఆల‌స్య రుసుముతో చివ‌రి తేదీ: మార్చి 11వ తేదీ, రూ. 2000ల‌తో

ప‌రీక్ష తేదీ: మార్చి చ‌వ‌రి వారంలో

ద‌రఖాస్తుల ప్ర‌క్రియ‌..

- అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి, హోం పేజీలోని PhD Entrance Test 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.

- ముందుగా Application Fee Payment పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.

- అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్క‌డ అడిగిన వివ‌రాల‌ను న‌మోదు చేయండి. అడిగిన‌ విద్యార్హతలను కూడా న‌మోదు చేయండి.

IISER Ph D Admissions : ఐఐఎస్‌ఈఆర్‌లో 2025 విద్యాసంవ‌త్స‌రం పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

- అన్ని వివ‌రాల‌ను న‌మోదు చేసిన త‌రువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

- అప్లికేష‌న్ పూర్తి చేసుకున్న త‌రువాత‌, డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.

ఉత్తీర్ణ‌త ఎంతంటే..

పీహెచ్‌డీ కోర్సుల్లో ఎంపిక ప్ర‌క్రియ‌న ప్ర‌వేశ ప‌రీక్ష‌తో ఉంటుంది.  ఈ ప‌రీక్షను ఆన్‌లైన్‌లో అంటే, కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ను 70 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇందులో క‌నీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓసీ అభ్య‌ర్థులకు అయితే, 35 శాతం సాధించాల‌ని పేర్కొన్నారు. ఇంకా, రిజర్వేషన్‌ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇలా, ప్ర‌క‌టించిన విధంగా అభ్య‌ర్థులు ఉత్తీర్ణ‌త సాధిస్తే ఓయూలో ప్ర‌వేశాలకు ఎంపిక‌వుతారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 31 Jan 2025 05:37PM
PDF

Photo Stories